ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna Board : నేడు కృష్ణాబోర్డు సమావేశం

ABN, Publish Date - Jan 21 , 2025 | 06:07 AM

కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం కీలకమైన అజెండాలతో మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు సమావేశం వాయిదా

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం కీలకమైన అజెండాలతో మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే..! జాతీయ ఆనకట్టల భద్రత చట్టం(ఎన్‌డీఎ్‌సఏ)-2021లోని సెక్షన్‌ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్‌ భద్రతకు సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారం తనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోనే ఉండాలని.. ఆయా బాధ్యతలను తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. సాగర్‌, శ్రీశైలంలోని అన్ని కాంపోనెంట్లను కృష్ణాబోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ సీఆర్‌పీఎ్‌ఫకు కట్టబెట్టాలనే ఏపీ కోరుతోంది. ఈ రెండు అంశాలు అజెండాగా కృష్ణాబోర్డు భేటీ జరగనుంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన విషయం తెలిసిందే.

Updated Date - Jan 21 , 2025 | 06:07 AM