ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Polavaram Project: డయాఫ్రం వాల్‌పై నేడే కీలక భేటీ

ABN, Publish Date - Jan 09 , 2025 | 03:53 AM

పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సంబంధించి గురువారం కీలక సమావేశం జరుగనుంది. ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిక్సర్‌ వాడకంపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ (ఐఈపీ) ఈ సందర్భంగా తన అభిప్రాయం వెల్లడించనుంది.

అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సంబంధించి గురువారం కీలక సమావేశం జరుగనుంది. ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిక్సర్‌ వాడకంపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ (ఐఈపీ) ఈ సందర్భంగా తన అభిప్రాయం వెల్లడించనుంది. సాయంత్రం ఆరున్నర గంటలకు డేవిడ్‌ బ్రియాన్‌ పాల్‌, జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో (అమెరికా), సీన్‌ హించ్‌బెర్గర్‌, చార్లెస్‌ రిచర్డ్‌ డొనెల్లీ(కెనడా)తో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కాంట్రాక్టు సంస్థలు బావర్‌, మేఘా ఇంజనీరింగ్‌, కెల్లర్‌ ప్రతినిధులు వర్చువల్‌గా భేటీ అవుతారు. విజయవాడ నుంచి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు-ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహమూర్తి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరవుతారు. మరోవైపు.. పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులు శనివారం (11న) పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో రెండ్రోజులు పర్యటిస్తారు.

Updated Date - Jan 09 , 2025 | 03:53 AM