ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్టీసీ స్థలం ఆక్రమణపై విజిలెన్స విచారణ

ABN, Publish Date - Jan 19 , 2025 | 11:09 PM

ములకలచెరువు ఆర్టీసీ బస్టాండు గోడను ధ్వంసం చేసి రహదారి నిర్మించారనే ఫిర్యాదుపై విజిలెల్స్‌ అధికారులు విచారణ చేపట్టారు.

ఆర్టీసీ బస్టాండు స్థలంలో నిర్మించిన సిమెంటురోడ్డు

ఆర్టీసీ బస్టాండు స్థలంలో నిర్మించిన సిమెంటురోడ్డు

మదనపల్లె, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ములకలచెరువు ఆర్టీసీ బస్టాండు గోడను ధ్వంసం

చేసి రహదారి నిర్మించారనే ఫిర్యాదుపై విజిలెల్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ములక లచెరువులో జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ బస్టాండు ఉంది. బస్టాండు చు ట్టూ ప్రహరీ నిర్మించారు. అయితే బస్టాండుకు వెనుక వైపున ఉంటే స్థానికులు..తమ రాకపోకలకు అనువుగా ఉండేందుకు కొంతభాగం గోడను ఽతొలగించి సిమెంటు రోడ్డు నిర్మించారు. దీనిపై కొందరు ఆర్టీసీ ఉద్యోగులు..ఆర్‌ఎం, డీఎంలకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సంస్థ స్థలం అన్యాక్రాంతం అవుతున్నా..బాధ్యతగల అధికారులు పట్టించుకోలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా నిర్లక్షంగా వ్యవహరించారన్నది వారి ప్రధాన ఆరోపణ. రూ.లక్షల విలువ చేసే రెండుకుంటల స్థలం ఆక్రమణకు గురైం దని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. గోడను ధ్వంసం చేసిన వారి చేత తిరిగీ నిర్మాణం చేయించలేదని తెలిపారు. సంస్థ స్థలం ఆక్రమణపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ బాధ్యతను విజిలెన్సకు అప్పగిం చారు. ఇందులోభాగంగా విజయవాడ విజిలెన్స అధికారులు ఇటీవల ములకలచెరువుకు చేరుకుని విచారణ చేపట్టారు. బస్టాండు స్థలం ప్రహరీని తొలగించి, రోడ్డు నిర్మాణం చేప ట్టడం ద్వారా ఆక్రమణ అయినట్లు గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసిం ది. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆక్రమణను అడ్డుకోని అధికారులు తమపైనే కక్షసాధింపు చర్యలు పాల్పడుతున్నట్లు అందులో వివరించారు.

Updated Date - Jan 19 , 2025 | 11:09 PM