ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వీస్‌ ప్రొవైడర్‌ విధానాన్ని వినియోగించుకోండి

ABN, Publish Date - Jan 24 , 2025 | 11:52 PM

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న సర్వీస్‌ ప్రొవైడర్‌ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని

మెప్మా ఆర్‌పీల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, జనవరి 24(ఆం ధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న సర్వీస్‌ ప్రొవైడర్‌ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే షాజహానబా షా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టౌనహాల్లో మెప్మా ఆధ్వర్యంలో చేతి వృత్తి కార్మికులకు అవగాహన సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాల్లో చేతివృత్తుదారులైన ఎలక్ర్టీషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఏసీ మెకానిక్‌, తాపీ మేస్త్రీలను ఒక గ్రూపుగా చేర్చి హోం ట్రయాంగిల్‌ యాప్‌ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తారన్నారు. అ యాప్‌లో రిజిసే్ట్రషన చేయించుకున్న కార్మికులను ప్రజలకు సత్వర సేవలందించడానికి వినియోగించుకోవచ్చన్నారు. హోంట్ర యాంగిల్‌ యాప్‌లో రిజిసే్ట్రషన చేయించుకున్న కార్మికులకు ప్రజలకు ఏయే సేవలు అందించాలో మెస్సేజ్‌ వస్తుందని, వారి ఇంటికి వెళ్లి కార్మికులు నిర్దేశించిన ఫీజుతో సేవలందించవచ్చన్నారు. స్విగ్గీ, జొమోటో లాగే హోం ట్రయాంగిల్‌ యాప్‌లో బుక్‌ చేసిన ఐదు నిమిషాల్లోనే మెకానిక్‌లు ఇంటికి వచ్చి సేవలందిస్తారన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన మనూజ మాట్లాడుతూ ఈ యాప్‌ ద్వారా మహిళలకు ఎంతో ఉపయోగ ముంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, మెప్మా సీఆర్‌పీ మధుసూధనరెడ్డి, ఆర్‌పీలు, మెనానిక్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 11:52 PM