పెద్దపాళ్యం ఫ్లై ఓవర్‌పై రాకపోకలు ప్రారంభం
ABN, Publish Date - Feb 01 , 2025 | 11:49 PM
ములకలచెరువు మండలం పెద్దపాళ్యం వద్ద ముంబాయి - చెన్నై జాతీయ రహదారిలోని ఫ్లై ఓవర్‌పై శనివారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి.
ములకలచెరువు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ములకలచెరువు మండలం పెద్దపాళ్యం వద్ద ముంబాయి - చెన్నై జాతీయ రహదారిలోని ఫ్లై ఓవర్‌పై శనివారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. రైల్వేగేటుపై ఓ వైపు ఏర్పాటు చేసిన బూస్టింగ్ గిర్డర్‌పై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దేశంలోనే అతి పొడువైన జాతీయ రహదారి(ఎనహెచ-42) కావడంతో ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్క డ రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో తరచూ రైల్వే గేటు పడుతుండ డంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరి నిలిచిపోతుండడంతో తరచూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగేవి. జాతీయ రహదారిలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్దపాళ్యం రైల్వేగేటుపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.49కోట్లు మంజూరు చేసింది. ఫ్లై ఓవర్ నిర్మాణానికి నిధులు విడుదల చేయడంతో 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో పను లు ప్రారంభమయ్యాయి. ఇరువైపులా రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేశారు. అయితే రైల్వేగేటుపై వెళ్తున్న బ్రిడ్జిపై కొంత భాగం పనులు నిలిచిపోయా యి. ఇక్కడ దిమ్మెలు ఏర్పాటు చేస్తే పనులు ముగుస్తాయన్న సమయంలో రెండేళ్ల పాటు నిలిపేశారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రైల్వేగేటుపై బూస్టింగ్ గిర్డర్ ఏర్పాటు చేయాలని ఉన్నతా ధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక బూస్టింగ్ గిర్డర్ తయారీని పూర్తి చేసి గత ఏడాది డిసెంబరు 20వతేదీన భారీ యంత్రాల సహాయం తో రైల్వేగేటుపై ఏర్పాటు చేశారు. దీనిపై రోడ్డు వేసి తదితర పనులు పూర్తి చేసి రాకపోకలు అనుమతించారు. దీంతో బ్రిడ్జిపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో వైపు ఏర్పాటు చేయాల్సిన బూస్టింగ్ గిర్డర్ తయారీ పనులు జరుగుతున్నాయి.
Updated Date - Feb 01 , 2025 | 11:49 PM