కార్మిక, కర్షక పక్షపాతి సుబ్బన్న: సీపీఐ
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:01 AM
కార్మిక, కర్షక పక్షపాతి కె.సుబ్బన్న అని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు.
కడప సెవెన రోడ్స్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కార్మిక, కర్షక పక్షపాతి కె.సుబ్బన్న అని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం కామ్రేడ్ కె.సుబ్బన్న 18వ వర్ధంతి సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయంలో సుబ్బన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్ర మా ట్లాడుతూ జీవితాంతం కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టుగా, పీడిత జనపోరాట యోధుడిగా సుబ్బన్న చరిత్రలో చిరస్థాయి గా నిలిచారన్నారు. అలంఖానపల్లెలో పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా, ఎస్సీ కాలనీ నిర్మాణం లోను, దండు, యానాది కాలనీ స్థాపించడంలోను, ఎర్రగుంట్ల సిమెంట్ ఫ్యా క్టరీలో, మంగలంపేట బైరటీస్ గనుల్లో, ఆర్టీసీలో ఏఐటీయూసీ కార్మిక సంఘం నిర్మాణం చేయడంలో, గండికోట ప్రాజెక్టు సాధనకు ఆమరణ దీక్ష చేసిన వారిలో ఒకడిగా ఉ న్నారన్నారు. రామనపల్లెలో దళితులకు అం డగా క్రియాశీలక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. నేటి యువతరం నాటి త్యాగధనుల ఆశయాలను అందిపుచ్చుకొని ప్రజాపోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 01 , 2025 | 12:01 AM