ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గాఢాంధకారం

ABN, Publish Date - Mar 04 , 2025 | 11:08 PM

దేశంలో పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ముంబై - చెన్నై జాతీయ రహదారిపై ములకలచెరువు కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. మూడేళ్లగా రాత్రిళ్లు భయం...భయం, ములకలచెరువు కనపడదు. అసలు ఇది జాతీయ రహదారేనా, ఇక్కడ అసలు ఊరు ఉందా అనే అనుమానం నెలకొంటోంది.

అలంకారప్రాయంగా

రాత్రిళ్లు కనపడని ములకలచెరువు

జాతీయ రహదారి విస్తరణ పనులతో తొలగించిన దీపాలు

ములకలచెరువు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):

దేశంలో పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ముంబై - చెన్నై జాతీయ రహదారిపై ములకలచెరువు కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. మూడేళ్లగా రాత్రిళ్లు భయం...భయం, ములకలచెరువు కనపడదు. అసలు ఇది జాతీయ రహదారేనా, ఇక్కడ అసలు ఊరు ఉందా అనే అనుమానం నెలకొంటోంది. దీనికి తోడు భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. పాదచారులకు సైతం చుక్కలు కన్పిస్తున్నాయి. రెండు కిలో మీటర్ల మేర ఎక్కడా ఒక్క వీధి దీపం వెలగదు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న వీధి దీపాలు తొలగించడంతో ఈ దుస్థితి నెలకొంది. వివరాల్లోకెళితే...

శ్రీ సత్యసాయి - అన్నమయ్య జిల్లా సరిహద్దులోని ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు 43 కిలో మీటర్ల జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ - 42) విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబరులో రూ.480.10 కోట్లు విడుదల చేసింది. 2022లో ఎన్‌హెచ్‌ - 42 విస్తరణ పనులు ప్రారంభించారు. పనుల్లో భాగం గా పనులకు అడ్డుగా ఉన్నాయని రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. పాత విద్యుత్‌ స్థంభాలు తొలగించా రు.


పాత విద్యుత్‌ స్తంభాలు తొలగించి కొత్త స్తంభా, విద్యుత్‌ టవర్లు ఏర్పాటు చేశారు. ఈ క్ర మంలో జాతీయ రహదారిలోని షాదీమహల్‌ నుంచి బస్టాండు సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, పెట్రోల్‌ బంకు, రైల్వే గేటు వరకు సుమారు రెండు కిలో మీటర్ల మేర ఉన్న పాత స్తంభాలు, విద్యుత్‌ దీపాలు తొలగించారు. అప్పటి నుంచి వీటి గురించి పట్టించుకునే నాధుడే కరవయ్యారు. విద్యుత్‌ దీపాలు లేకపోవడంతో దగ్గర కు వచ్చే వరకు వాహనఛోదకులకు పాదచారు లు కన్పించకపోవడంతో ప్రమాతాలు సంభవిస్తు న్నాయి. రోడ్డు దాటే సమయంలోనూ తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అంధగారంలో కొట్టుమిట్టాడుతుండడంతో ములకలచెరువు ప్రధాన బస్టాండ్ల రూపురేఖలు మారిపోయాయి. గతేదాడి జూలైలో జాతీయ రహదారికి ఇరువైపులా వందకుపైగా కొత్త స్థంభాలు ఏర్పాటు చేసి వాటికి వీధి దీపాలు అమర్చారు. అయినా ఏడు నెలలుగా వెలగకపోవడంతో అలంకారప్రాయంగా మారా యి. సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కొత్తగా ఏర్పా టు చేసిన వీధి దీపాలు వెలిగేలా చూసి జాతీయ రహదారిలో ఉన్న ములకలచెరువులో అంధగారం లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 04 , 2025 | 11:09 PM