Home » Annamayya
భక్తులు వైకుంఠ ఏకాదశి వేడుక లను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. స్వామివారిని వైకుంఠ ద్వారదర్శనం చే సుకొని పునీతులయ్యారు.
సోషల్ మీడియా ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్య మాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హెచ్చరించారు.
తెలు గుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రం లోని నాయీ బ్రాహ్మణు లకు రాజ కీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత దక్కిందని ఆ సంఘం కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు.
పట్టణంలోని జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న బీఎల్డబ్ల్యూ క్వార్టర్స్ స్థలంలో అక్రమంగా రేకు బంకులను ఏర్పాటు చేస్తుండడంతో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తిరుమల(Tirumala) మాడవీధుల విస్తరణలో భాగంగా కూల్చివేసిన అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని, లేనిపక్షంలో ఫిబ్రవరి 22న ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని మంగళం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి స్పష్టం చేశారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామంలో గత శనివారం తెల్లవారుజామున నిద్రస్తున్న ఓ వికలాంగుడైన వృద్ధుడు(59) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి నిద్రస్తున్న ఆ వృద్ధుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా మోది హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నియోజ కవర్గంలో 50 వేల పైచిలుకు సభ్యత్వాలు పూ ర్తి చేసుకుని లక్ష సభ్యత్వాల వైపున కు వడివడిగా అడుగులు పడుతు న్నాయని రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన కోదండరామాలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్క రించుకుని సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
కోళ్లబైలు-2 (వైఎస్సార్ కాలనీ) సర్పంచ్ శశికళ కనపడుట లేదని, పంచాయతీ ప్రజలు ఎంపీడీ ఓకు ఫిర్యాదు చేశారు. ఆమె బెంగళూ రులో సాఫ్ట్వేర్ ఉద్యోగం అక్కడే నివా సం ఉంటున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమె విదేశీ పర్యటనలో ఉన్నట్లు వారు వివరించారు.
రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యంతో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి చిన్నాన్న గోపాల్‌రెడ్డి కుమారులు, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి అలియాస్ మురళీరెడి,్డ ఆయన సోదరుడు మండల పరిషత ఉపా ధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట నారాయణ ఆదివారం భేటీ అయ్యారు.