యువపోరు పేరుతో జగన్ దొంగాట
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:00 PM
యువపోరు పేరుతో జగన్‌రెడ్డి దొంగాట ఆడుతున్నాడని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ

తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి
ములకలచెరువు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): యువపోరు పేరుతో జగన్‌రెడ్డి దొంగాట ఆడుతున్నాడని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో యువ త భవితను దెబ్బతీసి ఇప్పుడు డ్రామాలకు తెరలేపాడన్నారు. రాష్ట్రంలో రూ.4,271 కోట్లు ఫీజు, వసతి దీవెన బకాయిలు పెట్టి ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నాడన్నారు. 2014 - 19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే దాన్ని జగన్ 9 లక్షల మం దికి కుదించి 7 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు 6 లక్షల మంతికి నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసి యువతకు ద్రోహం చేసిందన్నారు. కమీషన్ల కోసం పరిశ్రమలపై జగన్ ప్రభుత్వం దాడులు చేసి పెట్టుబడుల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి నిరుద్యోగం పెంచారన్నారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్, కురబలకోట మండల కన్వీనర్ వైజీ సురేంద్రయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, మహిళా కార్యదర్శి గంగాదేవి, నేతలు సురేంద్రనాయుడు, విశ్వనాధరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, గంజి మోహన్ తదితరులు పాల్గొన్నారు.