మంచంపై ఉన్న పింఛనదారుల పరిశీలన
ABN, Publish Date - Jan 21 , 2025 | 11:28 PM
నియోజకవర్గంలో మంచానికి, వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమై నెలవారీ రూ.15 వేలు పింఛను పొందుతున్న లబ్ధిదారుల అర్హతను పరీక్షించేందుకు మంగళవారం నుంచి వెరిఫికేషన ప్రారంభమైంది
తొలిరోజు 37 మందికి పరీక్షలు
పులివెందుల టౌన, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో మంచానికి, వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమై నెలవారీ రూ.15 వేలు పింఛను పొందుతున్న లబ్ధిదారుల అర్హతను పరీక్షించేందుకు మంగళవారం నుంచి వెరిఫికేషన ప్రారంభమైంది. ముగ్గురు వైద్యు లు, ఒక డిజిటల్ అసిస్టెంటు, ఒక మెడికల్ ఆఫీసరుతో కూడిన బృందం మండలంలో ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఆరోగ్య పింఛను పొందుతున్న లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించారు.
కడప రిమ్స్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన డాక్టర్ శిలాభాను, ఆర్థోపెడిక్ డాక్టర్ రవి, డాక్టర్ నరసింహ, మెడికల్ ఆఫీసర్ స్నేహ ప్రత్యూష, డిజిటల్ అసిస్టెంటు శివశంకర్‌తో కూడిన వైద్య బృందం పింఛనుదారులను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పెన్షనదారుల జాబితా ప్రకారం మండలంలో తొలిరోజు రూరల్ పరిధిలో ఎర్రబల్లె 2, కొత్తపల్లె 2, అచ్చివెల్లి 1, అలాగే మున్సిపాలిటీ పరిధిలో పెద్దరంగాపురం 1, సీయోనుపురం 3, చెన్నారెడ్డికాలనీ 4, బయమ్మతోట 1, మిస్సమ్మ బంగ్లా 1, గుంతబజారు 1, వెంకటాపురం 1, భాకరాపురం 4, కె.వెలమవారిపల్లె 1, ప్రశాంతనగర్ 1, అంకాలమ్మపేట 1, నగిరిగుట్ట 3, శ్రీరామటెంపుల్ 3, రాజీవ్‌కాలనీ 1, ఎస్‌బీఐ కాలనీ 4, చిన్నరంగాపురం ఇద్దరు లబ్ధిదారులను తనిఖీ చేశారు. కాళ్లు, చేతులు కదలిక, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. మంచంపైనే ఉం టూ కదల్లేని పింఛనుదారులు మండలంలో మున్సిపాలిటీలో 37 మం ది వరకు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఆరోగ్యపింఛన్లు పొందుతున్న వారిని పరీక్షించే విషయంలో తగిన సూచనలు, సలహాలు అందించారు. అర్హులకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అనర్హులను గుర్తిస్తామన్నారు. దివ్యాంగుల పరిస్థితిని డాక్టర్లు మొబైల్‌యాప్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పరిశీలనలో పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 11:28 PM