ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధిలో పాత గుంతల్లోనే కొత్త పనులు

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:40 PM

ఏ ప్రభుత్వం వచ్చినా తమ పని మాత్రం మారదన్నట్టుగా ఉపాధి సిబ్బంది వ్యవ హారశ్తెలి కనిపిస్తోంది.

కొండయ్యగారిపల్లిలో పాత గుంతలలోనే పనులు చేస్తున్న దృశ్యం

నిమ్మనపల్లి ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఏ ప్రభుత్వం వచ్చినా తమ పని మాత్రం మారదన్నట్టుగా ఉపాధి సిబ్బంది వ్యవ హారశ్తెలి కనిపిస్తోంది. ఇందుకు నిదర్శ నంగా పాత గుంతలలోనే మళ్లీ పనులు చేపడుతూ వారికి తోచినంత దండుకొం టున్నారని పలువురు కూలీలు ఆరోపిస్తు న్నారు. ముఖ్యంగా రైతుల పొలాల్లో పారంఫాండ్స్‌, చెరువులలో క్యాంటిల్‌ ఫాం డ్స్‌, ట్రెంచలు, కాలుకపూడికతీత, గడ్డి పెంపకం, పండ్లతోటల పెంపకం, పనులు చేపట్టాలి. అయితే పలు పంచాయతీల్లో చెరువులలో క్యాటిల్‌ ఫాండ్స్‌, పారంఫాండ్స్‌ తవ్వకాలను పాత గుంతల్లోనే కూలీలకు ఒక రోజు పని కల్పించి మరుసటి రోజు నుం చి యంత్రాలతో పనుల చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇది ఇలాఉండగా రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా నే పాడి రైతుల సౌకర్యార్థం గోకులాలను కేటాయించింది. అయితే మండలానికి 25 గోకులాలు కేటాయించి వాటిని అర్హత కలిగి న పాడి రైతుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయి తే ఏపీవో తన చేతి వాటం చూపించి పాడి ఆవులు లేని వారికి కూడా గోకులాలు మం జూరు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఏపీవో రమేష్‌ను వివరణ కోరగా అలాం టివి ఏమీ జరగలేదని తెలిపారు. గోకులాలను స్థానిక ఎమ్మెల్యే షాజహాన బాషా ప్రతిపాధించిన వారికే కేటాయించామని తెలిపారు.

Updated Date - Feb 09 , 2025 | 11:40 PM