గజ వాహనంపై దేవదేవుడి అభయం
ABN, Publish Date - Feb 10 , 2025 | 11:32 PM
ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజైన సోమవా రం శ్రీవారు గజ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
తంబళ్లపల్లె, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజైన సోమవా రం శ్రీవారు గజ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారిని రథం పై కొలువు దీర్చి రథోత్సవం వేడుకగా నిర్వహించారు. మాడ వీధు ల్లో ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామం స్మరిస్తూ స్వామి వారికి కర్ఫూర హారతులిచ్చి నైవేదాద్యాలు సమర్పించారు. భజన బృందాల కోలాటలు, చెక్కభజనలు, అన్నమ య్య సంకీర్తనలు, గోవిందనామస్మరణల నడుమ వాహన సేవ నయనమనోహరంగా సాగింది. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ మునిబాల కుమార్, టెంపుల్ ఇన్సపెక్టర్ కృష్ణమూర్తి, ఉప ప్రధాన అర్చకులు కృష్ణప్రసాద్ భట్టర్, రమేష్ స్వామి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 11:32 PM