అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయండి
ABN, Publish Date - Mar 03 , 2025 | 11:23 PM
బి. కోడూరు మండలంలో అసంపూ ర్తిగా నిలిచిన విద్యాశాఖ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరతు న్నారు.
బి.కోడూరు మార్చి 3, (ఆంద్రజ్యోతి):బి. కోడూరు మండలంలో అసంపూ ర్తిగా నిలిచిన విద్యాశాఖ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరతు న్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ భవనానికి 55 లక్షలు సర్వశిక్ష అభియాన కింద మంజూరయ్యాయి. ఆ పనిని దక్కిం చుకున్న గుత్తేదారు దాదాపుగా 25లక్షలు ఖర్చుపెట్టి బిల్డింగ్ పనులు ప్రారంభించారు. కాగా ఆ భవనం ఇంకా పూర్తికాక అసంపూర్తిగా ఆగిపోయింది. ఈ విషయమై ఎంఈవో సునీల్‌కు మార్ మాట్లాడు తూ విద్యాశాఖ భవనం మంజూరై చాలా రోజులవుతున్నా పూర్తి కాలేదనిన్నారు. ఈ విషయంగా సర్వ శిక్షా అభియాన ఏఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా గత ప్రభుత్వంలో బిల్లులు రాక పూర్తిచేయలేదన్నారు. ఈ సంవ త్సరం నిధులు వస్తున్నాయని విద్యాశాఖ భననాన్ని పూర్తిచేసి వారికి అప్పచెబుతామని పేర్కొన్నారు.
Updated Date - Mar 03 , 2025 | 11:23 PM