అంగళ్లులో మరో భూవివాదం
ABN, Publish Date - Feb 02 , 2025 | 11:45 PM
కురబలకోట మండ లం అంగళ్లు భూ వివాదాలకు నిలయంగా మారింది.
మదనపల్లె, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి):కురబలకోట మండ లం అంగళ్లు భూ వివాదాలకు నిలయంగా మారింది. మద నపల్లె పట్టణానికి దగ్గరగా ఉండటం, దానికితోడు అటు అనంతపురం, ఇటు కడప జాతీయ రహదారులు అంగళ్లు గుండా వెళ్తుండటంతో అక్కడి ఽభూముల ధరలకు రెక్కలొ చ్చాయి. దీంతో ఎప్పుడో అమ్మేసిన భూములపై వివాదాలు సృష్టించడం, అదే భూమిని, ప్లాటును మరొకరికి విక్రయా లతో డబుల్ రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. గత అయిదేళ్ల వైసీపీ పాలనలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇందులోభాగంగా మొన్న అంగళ్లు సర్వేనంబర్:226, నిన్న అంగళ్లు సర్వేనంబర్:220లలో వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోగా, తాజాగా అంగళ్లు నుంచి ముదివేడు వెళ్లే ప్రధాన మార్గంలోని అంగళ్లు సర్వేనంబర్:236లోనూ ఇలాంటి సం ఘటనే చోటు చేసుకుంది. ఈ భూమి మాదని ఒకరు రం గంలోకి దిగితే, కాదు..మాదంటూ మరొకరు ముందుకెళ్తు న్నారు. ఈ క్రమంలో ఓ వర్గం భూమిని చదును చేసి, రాతి కూసాలతో కంచె వేసి మట్టితోలితే, మరోవర్గం వాటిని తొల గిస్తోంది. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు, ఘర్షణ చోటు చేసుకుని ఉద్రిక్తత పరిస్థితికి దారితీస్తోంది. ఈ వ్యవహారం అటు స్థానికులు, ఇటు పోలీసులకు తల నొప్పిగా మారిందని చెబుతున్నారు. ముదివేడు రోడ్డులో వారంరోజులుగా జరుగుతున్న సంఘటన నేపథ్యంలో అంగ ళ్లుకు చెందిన బాధితులు ఎం.పార్వతమ్మ, ఎం.రెడ్డెప్పరెడ్డిలు జిల్లా ఎస్పీ, మదనపల్లె డీఎస్పీ, ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు...తుమ్మచెట్లపల్లెకు చెందిన ఎం.శ్రీనివాసులురెడ్డి నుంచి అంగళ్లు సర్వేనంబర్ 236లో 59సెంట్ల భూమిని 2008లో కొనుగోలు చేశారు. ఈ భూమి విక్రయానికి సంబంధించి శ్రీనివాసులురెడ్డి భార్య ఎం.గీతమ్మ సాక్షి సంతకం చేశారు. అయితే ఇదే భూమిని ఎం.గీతమ్మతోపాటు కుమారులు అదే గ్రామానికి చెందిన పి.రెడ్డెప్ప, పి.శ్రీనివాసులుకు విక్రయించినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించగా స్టే ఇచ్చిందన్నారు. అయితే వివాదా స్పద భూమిని చదును చేసి, ఎర్రమట్టితోలి కంచె ఏర్పాటు చేస్తుండగా అడ్డుకోగా, తమపై దాడి చేశారని బాధితులు ఎం.పార్వతమ్మ, ఎం.రెడ్డెప్పరెడ్డిలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. అలాగే ఒకే భూమిని ఇద్దరికి అమ్మి తమకు మోసం చేసిన నిందితులపై చర్యలు తీసు కుని, తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
Updated Date - Feb 02 , 2025 | 11:45 PM