ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD : దేవదాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా రామచంద్రమోహన్‌

ABN, Publish Date - Jan 23 , 2025 | 04:51 AM

దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా కె.రామచంద్రమోహన్‌ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా కె.రామచంద్రమోహన్‌ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం జరిగిన ఐఏఎస్‌ బదిలీల్లో కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త కమిషనర్‌ను నియమించే వరకూ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆ శాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌కు బాధ్యతలు అప్పగించింది.

ఆలయ కమిటీలోకి రిటైర్డ్‌ ఈఈ యూఏ రావు

వారసత్వ ఆలయాల అభివృద్ధికి, పురాతన కట్టడాలను రక్షించేందుకు ప్రభుత్వం గతంలో నియమించిన కమిటీలో జల వనరుల శాఖ రిటైర్డ్‌ ఈఈ ఉప్పలపాటి ఎ.రావుకు తాజాగా స్థానం కల్పించింది. ఈమేరకు దేవదాయ శాఖ సెక్రటరీ ఎస్‌.సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 23 , 2025 | 04:51 AM