జనసేన ఆత్మీయ సమావేశం
ABN, Publish Date - Feb 03 , 2025 | 12:28 AM
స్థానిక ఎన్జీవో హోమ్‌లో జనసేన పట్టణాధ్యక్షుడు చలపతి అధ్యక్షతన ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పాల్గొన్న జనసైనికులు
కదిరిఅర్బన, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్జీవో హోమ్‌లో జనసేన పట్టణాధ్యక్షుడు చలపతి అధ్యక్షతన ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇనచార్జి బైరవప్రసాద్ మాట్లాడుతూ.. ఎనడీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పట్టణంలోని 36 వార్డుల్లో సమస్యలను గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరష్కారం అయ్యేలా జనసైనికులు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో జనసేన శివశంకర్, కుటాల లక్ష్మణ్, ఆంజిబాబు, ప్రతాప్, మహేష్, రాజేంద్రప్రసాద్, రెడ్డెమ్మ, మంగమ్మ, గంగరాజు, లోకేష్, హరీష్ పాల్గొన్నారు.
Updated Date - Feb 03 , 2025 | 12:28 AM