ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గన్నవరంలో ‘భూ’బాగోతాలు

ABN, Publish Date - Feb 21 , 2025 | 01:22 AM

గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అరాచకం సృష్టించారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే గద్దల్లా వాలిపోయారు. చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న భూములను సైతం వదల్లేదు. ఆయా భూముల్లో అక్రమ మైనింగ్‌ నిర్వహించి కోట్లు కొల్లగొట్టారు. కొన్ని చోట్ల ఆ భూములకు పట్టాలు పుట్టించి జగనన్న కాలనీల కోసం ప్రభుత్వానికి అమ్మేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివాదాల్లోనూ తలదూర్చి ఆ ఆస్తులను తమ పరం చేసు కున్నారు. వైసీపీలో చేరలేదనే అక్కసుతో టీడీపీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేశారు. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలను ఆక్రమించుకున్నారు. అధికారులను అడ్డంపెట్టుకుని ఎన్నో అడ్డదారులు తొక్కారు. గన్నవరం, బాపులపాడు మండలాల్లో ఐదేళ్ల పాటు సాగిన అరాచకాల్లో కొన్ని ఇలా..

తవ్వే కొద్దీ వెలుగులోకి వంశీ అనుచరుల కబ్జాలు!

- ప్రభుత్వ భూమి కనిపిస్తే కనుమరుగే..

- వైసీపీలో చేరలేదని టీడీపీ నేతల ఆస్తుల ధ్వంసం

- అధికారుల అండతో యథేచ్ఛగా ఆక్రమణలు

- రైతులను బెదిరించి లాక్కొన్న భూముల్లో అక్రమ మైనింగ్‌

- గన్నవరం, బాపులపాడు మండలాల్లో అనేక అరాచకాలు

గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అరాచకం సృష్టించారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే గద్దల్లా వాలిపోయారు. చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న భూములను సైతం వదల్లేదు. ఆయా భూముల్లో అక్రమ మైనింగ్‌ నిర్వహించి కోట్లు కొల్లగొట్టారు. కొన్ని చోట్ల ఆ భూములకు పట్టాలు పుట్టించి జగనన్న కాలనీల కోసం ప్రభుత్వానికి అమ్మేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివాదాల్లోనూ తలదూర్చి ఆ ఆస్తులను తమ పరం చేసు కున్నారు. వైసీపీలో చేరలేదనే అక్కసుతో టీడీపీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేశారు. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలను ఆక్రమించుకున్నారు. అధికారులను అడ్డంపెట్టుకుని ఎన్నో అడ్డదారులు తొక్కారు. గన్నవరం, బాపులపాడు మండలాల్లో ఐదేళ్ల పాటు సాగిన అరాచకాల్లో కొన్ని ఇలా..

-(గన్నవరం/హనుమాన్‌ జంక్షన్‌రూరల్‌, ఆంధ్రజ్యోతి)

- అంపాపురంలో సర్వే నంబరు 109-3లో 14 ఎకరాలను పేద రైతులు సాగు చేసుకుంటుంటే ఇది ప్రభుత్వ భూమి, సాగు చేయకూడదని రెవెన్యూ శాఖతో చెప్పించి రైతులను ఖాళీ చేయించారు. ఆ తర్వాత బినామీల పేర్లతో ఆ భూములకు పట్టాలను పుట్టించి జగనన్న కాలనీ పేరుతో పట్టా భూమితో సహా అమ్మేందుకు ప్రయత్నిస్తే కొందరు నిబద్ధత గల అధికారులు అడ్డుపడటంతో అది ఆగిపోయింది. డొంకతో సహా కలిపి ఎకరా రూ.50 లక్షలకు అమ్మేందుకు సిద్ధమవ్వగా.. ప్రభుత్వం మారిపోవడంతో మరుగునపడిపోయింది.

- రేమల్లెలో చిన్నసన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న సర్వే నంబరు 422-8,9లో 20 ఎకరాల అసైన్డ్‌ భూములను ఆక్రమించుకోవడంతో పాటు 20 అడుగులకుపైగా అక్రమ మైనింగ్‌ నిర్వహించారు. అదే గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి పోలవరం గట్టున ఉన్న మూడు ఎకరాల భూమిలో లేఅవుట్‌కు సిద్ధం చేస్తున్న విషయం తెలుసుకుని స్థానిక నాయకులతో కలిసి 26 సెంట్ల భూమిని మండల స్థాయి వైసీపీ నాయకుని పేరుతో రిజిసే్ట్రషన్‌ చేయించారు. తదనంతరం అనుంగు సహచరులు తమ పేరుతో రిజిసే్ట్రషన్‌ చేయించుకున్నారు. వీరి ఆరాచకాలను భరించలేక ఆ వ్యక్తి తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోవడం గమనార్హం.

- మల్లవల్లి పారిశ్రామికవాడలో చదును చేస్తున్నామనే పేరుతో కన్‌స్ట్రక్షన్‌ వారిని అడ్డుపెట్టుకుని 100 ఎకరాలకుపైగా భూమిలో అక్రమంగా తవ్వకాలు జరపడంతో పాటు కోట్లాది రూపాయల గ్రావెల్‌ను పోర్టు అభివృద్ధి పనుల పేరుతో తరలించేశారు. మట్టి మాఫియా అయితే వేలేరు, కొత్తపల్లి, రంగన్నగూడెం, తదితర గ్రామాల్లో చెరువులను చెరపట్టి దోచుకోవడమే పనిగా అక్రమ తవ్వకాలు నిర్వహించింది.

- బాపులపాడు మండలంలోనే సుమారు 200 ఎకరాల వరకూ అక్రమ తవ్వకాలతో గోతులు పడి ఉన్నాయి. కోట్లాది రూపాయలు మాత్రం మాజీ ఎమ్మెల్యే అనుచరుల జేబుల్లోకి వెళ్లాయి. బాపులపాడు మండలానికి తహసీల్దార్‌గా రావడానికే అధికారులు భయపడ్డారంటే పరిస్థితి అర్థమవుతోంది. ఇదే అదనుగా గన్నవరం తహసీల్దార్‌గా పనిచేసిన నరసింహారావు (బాపులపాడు మండలంలో కూడా పని చేశారు) ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ పనులను చక్కబెట్టారు.

టీడీపీ నేతల ఆస్తుల ధ్వంసం

తన గెలుపునకు కృషి చేసిన టీడీపీ నాయకులను తనతో పాటే వైసీపీలో చేరాలని వంశీ ఆదేశాలు జారీ చేశాడు. బాపులపాడు మండలంలోని నాయకులు అడ్డం తిరగడంతో వారి ఆస్తులను ధ్వంసం చేసేందుకు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి భయోత్పాతం సృష్టించారు.

- తిప్పనగుంటకు చెందిన పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు మాదాల శ్రీనివాసరావు ఎరువుల దుకాణాన్ని అర్ధరాత్రి రెవెన్యూ అధికారుల సహకారంతో నేలమట్టం చేయించారు. వేరొకరి వద్ద కొనుగొలు చేసిన స్థలంలో రేకుల షెడ్డు వేసి ఎరువుల దుకాణం నడుపుతుంటే రాత్రి ఎనిమిది గంటల సమయంలో నోటీసును గోడకు అంటించి తెల్లవారుఝామున దుకాణాన్ని కూల్చివేశారు. దీనికి అప్పటి తహసీల్దార్‌ నరసింహారావుతో పాటు రెవెన్యూ సిబ్బందిసహకారం అందించారు. రైతులు అడ్డుకుంటే పోలీసులతో కేసులు పెట్టించి వేధించారు. నేలమట్టమయిన దుకాణం రాళ్లను కూడా అక్కడి రోడ్ల గోతులు పూడ్చేందుకు ఉపయోగించారంటే అరాచకం ఏ స్థాయిలో చేశారో అర్థం చేసుకోవచ్చు.

- రేమల్లెకు చెందిన తుమ్మల ఉదయ్‌ను వైసీపీలో చేరాలని ఒత్తిడి చేసినా లొంగక పోవడంతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీస్‌స్టేషన్‌ తీసుకువెళ్లి బెదిరించారు. అప్పటికీ వినకపోవడంతో అన్ని అనుమతులు తీసుకుని సాగు చేసుకుంటున్న 13 ఎకరాల రొయ్యల చెరువుకు మల్లవల్లిలో పని చేస్తున్న యంత్రాలను తీసుకువచ్చి రాత్రికి రాత్రే గండ్లు పెట్టడంతో పాటు విద్యుత కనెక్షన్లు కట్‌ చేయించారు. దీని వల్ల రూ.35 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ఉదయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఆ కుటుంబాన్ని దెబ్బతీశారు.

- విజయవాడ మధురానగర్‌కు చెందిన సుంకర సీతామహాలక్ష్మి అనే మహిళ గన్నవరం పట్టణంలో సర్వే నంబర్‌ 477-2లో 484 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. అయితే ఆ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రోద్బలంతో సూరపనేని అనిల్‌ కుమార్‌, వైసీపీ జిల్లా నాయకుడైన మేచినేని బాబు మేనల్లుడు శివరామకృష్ణ ఆక్రమించుకుని దొంగ రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారని బాధితులు కలెక్టర్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. దీనికి రెవెన్యూ అధికారులు సిహెచ్‌.నరసింహారావు, పవన్‌కుమార్‌, రిజిస్ర్టార్‌ వెంకటేశ్వరరావు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- సూరంపల్లి గ్రామానికి చెందిన గొట్టిపూళ్ల్ల రఘునాథ్‌కు సర్వే నంబర్‌ 366లో 5.77 ఎకరాల భూమి ఉంది. 2019లో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అతని అనుచరులు కొమ్మా కోట్లు, సిహెచ్‌.రవీంద్రబాబు, ఎన్‌కె.ప్రసాద్‌, పి.గోపిరాజు, కె.నాగబూషణం తదితరులు తనను బెదిరించి, కుటుంబ సభ్యులను చంపుతామని భయపెట్టి రూపాయి కూడా ఇవ్వకుండా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారని బాధితుడు గొట్టిపూళ్ల్ల రఘునాథ్‌ తెలిపారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

- గన్నవరం టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావుకు సూరంపల్లిలో సర్వే నంబర్‌ 308-4లో 99 సెంట్లు పూర్వాజితంగా వచ్చింది. 1964లో ప్రభుత్వం బీఫారం పట్టా కూడా ఇచ్చింది. 1999లో నగదు కట్టించుకుని డిఫారం పట్టాను మంజూరు చేసింది. 2019లో వెంకటేశ్వరరావు తల్లి మృతి చెందడంతో, ఆ భూమిని తన పేరున మార్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ఆయన వైసీపీలోకి రాలేదనే అక్కసుతో ఆ భూమిని ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులతో బోర్డులు పెట్టించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఆ భూమిలో ఉన్న షెడ్డును జేసీబీలతో అక్రమంగా కూల్చివేయించారు. ఇదేమని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారు. ముందుగా ఆ భూమిలోకి వంశీతో పాటు వైసీపీ నాయకులు, తహసీల్దారు నరసింహారావు వెళ్లి చూశారు. ఆ తర్వాత బోర్డులు పెట్టి కూల్చేశారు.

Updated Date - Feb 21 , 2025 | 01:22 AM