ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా

ABN, Publish Date - Jan 10 , 2025 | 11:51 PM

తాను భూములను కబ్జాలు చేసినట్లు ఎమ్మెల్యే పార్థసారథి అధారాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

ఆదోని అగ్రికల్చర్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : తాను భూములను కబ్జాలు చేసినట్లు ఎమ్మెల్యే పార్థసారథి అధారాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తాను కొన్ని సర్వే నెంబర్లలో ఉన్న భూములను కబ్జా చేశానని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందులో ఏ ఒక్క ఆధారమైన మీ దగ్గర ఉంటే బయట పెట్టాలంటూ సవాల్‌ విసిరారు. ఎన్నికలకు ముందు కబ్జా చేస్తే తోలుతీస్తా అని పదేపదే అన్న మీరు.. మీ ముఖ్య అనుచరుడు డాక్టర్‌ రవి కిరణ్‌ ఆధార్‌ కార్డు మార్పు చేసి రూ. కోట్ల విలువచేసే భూమిని రిజిస్ట్రేషన చేసుకోలేదా అంటూ ప్రశ్నించారు. పదేపదే నా పేరు జపం చేస్తూ చిట్టా విప్పుతా అనడం కాదు... చిట్టా విప్పి మాట్లాడాలని అన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రజలను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడొద్దన్నారు. బైపాస్‌ రోడ్‌, మెడికల్‌ కళాశాల, షాపింగ్‌ మాల్‌ నిర్మాణాలను పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఇప్పటికైనా పసలేని మాటలు మాట్లాడడం మానేయాలని హితవు పలికారు. సమావేశంలో వైసీపీ నాయకులు చంద్రకాంత రెడ్డి, వైస్‌ చైర్మన నరసింహులు కౌన్సిలరులు ఫయాజ్‌, మధు, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 11:51 PM