ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే

ABN, Publish Date - Jan 06 , 2025 | 11:41 PM

జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి. రంజిత బాషా తెలిపారు.

పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్‌

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి. రంజిత బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో లెప్రసీ కేస్‌ డిటెక్షన క్యాంపెయిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2027 సంవత్సరం నాటికి కుష్ఠు వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే చేస్తారన్నారు. జిల్లాలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఇంటింటికి తిరిగి పరీక్షలు చేసి అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కుష్ఠు, ఎయిడ్స్‌ అండ్‌ టీబీ అధికారి డా.ఎల్‌. భాస్కర్‌ జిల్లా న్యూక్లియస్‌ వైద్యాధికారి డా.జి. మల్లికార్జున రెడ్డి, డీపీఎంవోలు జి. విజయప్రకాష్‌, వై. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:41 PM