ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Flamingo Festival : రేపటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్‌

ABN, Publish Date - Jan 17 , 2025 | 04:25 AM

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. సూళ్లూరుపేటతో పాటు

మూడు రోజులు నిర్వహణ... ఆరేడు లక్షల మంది హాజరు!

తిరుపతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. సూళ్లూరుపేటతో పాటు పరిసర ప్రాంతాలైన నేలపట్టు, అటకానితిప్ప, బీవీ పాలెం, శ్రీసిటీ తదితర ఐదు చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొలిరోజున ఉదయం సూళ్ళూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రారంభిస్తారు. 2020 జనవరిలో చివరిసారిగా ఫ్లెమింగో ఫెస్టివల్‌ జరిగింది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఈ ఉత్సవాలను పునఃప్రారంభిస్తోంది. మూడు రోజుల్లో మొత్తం 6-7 లక్షల మంది పర్యాటకులు ఫెస్టివల్‌కు వస్తారని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

Updated Date - Jan 17 , 2025 | 04:25 AM