నాణ్యమైన విద్యకు మోడల్‌స్కూల్స్ ఏర్పాటు
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:10 AM
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంఈవోలు సావిత్రమ్మ, శోభారాణిలు తెలిపారు.
ప్రొద్దుటూరు టౌన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంఈవోలు సావిత్రమ్మ, శోభారాణిలు తెలిపారు. మోడల్‌స్కూల్స్ ఏర్పాటుపై శుక్రవారం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలులో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1, 2 తరగతులతో ఫౌండేషన్ స్కూల్స్, 1 నుంచి 5వ తరగతి వరకు 40 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలను బేసిక్ పాఠశాలలుగా మార్పు చే స్తారన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు 50కిపైగా విద్యార్థులున్న పాఠశాలలను మోడల్స్ స్కూల్స్‌గా, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1 నుంచి 5 కి.మీ. పరిధిలో ఉన్న పాఠశాలలను విలీనం చేసి విద్యార్థుల ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌ను నెలకు రూ.600 ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రతి పంచాయతీకి, వార్డుకు ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మోడల్స్ స్కూల్స్ ఏర్పాటుపై పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 12:10 AM