ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడాభివృద్ధికి కృషి చేయాలి

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:53 PM

క్రీడాభివృద్ధికి కృషి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు శాప్‌ చైర్మన రవినాయుడను కోరారు.

శాప్‌ చైర్మనకు వినతి పత్రం ఇస్తున్న ఎంపీ, క్రీడా ప్రతినిధులు రామాంజనేయులు, తదితరులు

శాప్‌ చైర్మన రవినాయుడుకు ఎంపీ బస్తిపాటి నాగరాజు విజ్ఞప్తి

కర్నూలు స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 1: (ఆంధ్రజ్యోతి): క్రీడాభివృద్ధికి కృషి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు శాప్‌ చైర్మన రవినాయుడను కోరారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయనను పలు క్రీడా సంఘాల నాయకులు సన్మానించారు. జిల్లా తైక్వాండో జాయింట్‌ సెక్రటరీ టి.వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. టీ.వెంకటేశ్వర్లు మాట్లడుతూ తైక్వాండోకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టి.అజయ్‌ ఉన్నారు.

ఫ డీఎ్‌సఏ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు రామాంజనేయులు హర్షవర్దన, సురేంద్ర, నాగరత్నమయ్య, వంశీ, విజయకుమార్‌, చిన్న సుంకన్న, నవీన, తైక్వాండో వెంకటేశ, రవికుమార్‌, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ గిడ్డయ్య కలిసి వినతులు అందజేశారు. నగర పరిధిలో హాకీ టర్ప్‌ కోర్టు ఏర్పాటు చేయాలని, నడిచేందుకు వాకర్స్‌కు ప్రత్యేకంగా ట్రాక్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని శాప్‌ చైర్మన హామీ ఇచ్చారన్నారు.

ఫ విలువిద్య సంఘం సభ్యుల వినతి:

డీఎ్‌సఏ స్టేడియంలో శాఫ్‌ చైర్మన రవినాయుడును జిల్లా విలువిద్య సంఘం కార్యదర్శి కె.నాగరత్నమయ్య కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా నుంచి ఆర్చరీలో రాష్ట్ర, జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. మరిన్ని విజయాలు అందుకోవడానికి కోచ, ఆర్చరి రికర్వ్‌ కాంపౌండ్‌ రౌండ్‌ పరికరాలు గ్రౌండ్‌ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్చరి కోచ వంశీ, బాలాజి ఉన్నారు.

క్రీడల అభివృద్ధ్దికి సహకరించాలి

ఫ టీజీ వెంకేటశకు శాప్‌ చైర్మన వినతి :

రాయలసీమ అభివృధ్దిలో ప్రధాన భూమిక పోషించినవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని క్రీడల అభివృద్ధికి సహకరించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకేటశకు శాఫ్‌ చైర్మన రవినాయుడు కోరారు. శనివారం టీజీ వెంకటేశను ఆయన నివాసంలో శాప్‌ చైర్మన మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఏపీలోనీ క్రీడలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ముందుగా జిల్లాలో చేపట్టల్సిన క్రీడల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు టీజీ వెంకటేశకు వివరించారు. ఏదొక క్రీడను దత్తత తీసుకుని ఆ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులనుల ప్రోత్సహించాలని కోరారు. క్రీడల ప్రోత్సాహానికి తమ సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయనీ టీజీ వెంకటేశ హామీ ఇచ్చారు.

Updated Date - Feb 01 , 2025 | 11:53 PM