ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విందు.. పసందు

ABN, Publish Date - Jan 26 , 2025 | 01:18 AM

భారత ప్రధాని నరేంద్రమోదీ సంవిధాన్‌ గౌరవ దివాస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశవరం దళితవాడలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి పర్యటించారు.

కోటికేశవరం దళితవాడలో సహపంక్తి భోజనాలు చేస్తున్న ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్‌బొడ్డు వెంకటరమణ చౌదరి

కోరుకొండ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : భారత ప్రధాని నరేంద్రమోదీ సంవిధాన్‌ గౌరవ దివాస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశవరం దళితవాడలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి పర్యటించారు.ఈ సందర్భంగా ఎంపీ దళితులతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.ఎంపీ మాట్లాడుతూ నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా హమరా సంవిధాన్‌...హమరా స్వాభిమాన్‌ పేరుతో దేశ వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతున్నట్టు ఎంపీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏపీఆర్‌ చౌదరి, టీడీపీ నాయకులు తనకాల నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్‌ మూడే సింధు దివ్య, అడపా వీరబాబు, పలువురు జనసైనికులు,బీజేపీ, టీడీ పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2025 | 01:18 AM