జాతీయ విద్యావిధానం వద్దు
ABN, Publish Date - Jan 07 , 2025 | 12:48 AM
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో జాతీయ విద్యా విధానం 2020 విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తుందని యూటీఎఫ్ స్వర్ణో త్సవ మహాసభల్లో మేధావులు, విద్యావేత్తలు వ్యతిరేకించారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహా సభల్లో రెండోరోజు సో
కాకినాడ యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలో వ్యతిరేకించిన
మేధావులు, విద్యావేత్తలు
ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ధ్వజం
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో జాతీయ విద్యా విధానం 2020 విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తుందని యూటీఎఫ్ స్వర్ణో త్సవ మహాసభల్లో మేధావులు, విద్యావేత్తలు వ్యతిరేకించారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహా సభల్లో రెండోరోజు సోమ వారం జరిగిన విద్యా సదస్సుకు యూటీఎఫ్ అసోసియేట్ సురేష్‌కుమార్ అధ్యక్షత వహించారు. సదస్సులో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఫ్లోర్ లీడర్ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 వల్ల దేశంలో విద్యాభివృద్ధి కుంటుప డుతుందన్నారు. ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి సీఎన్.భారతి మాట్లాడుతూ దేశంలో విద్య పూర్తిగా వ్యాపారం అయిపోందన్నారు. ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధ రించాలన్నారు. ఉపాధ్యా యులు సామాజికం, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నప్పుడే మంచి బోధన జరుగుతుంద న్నారు. ఏపీఎన్‌జీవో అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఉపాఽధ్యాయుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు. ఏపీఎన్‌జీవో నాయ కుడు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యో గుల సమస్యలను పరిష్కరించాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ప్రభుత్వ పాఠ శాల విద్య ధ్వంసమైందని, అనేక పాఠశాలలు ఏకో పాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయన్నారు. ప్రభు త్వం తక్షణమే జీవో 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, గోపిమూర్తి, ఇళ్ల వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే.నగేష్, చక్రవర్తి, రాష్ట్రకార్యదర్శులు మోహన్‌రావు, కిషోర్, మనోహర్, లక్ష్మీరాజ్యం, జ్యోతిబసు పాల్గొన్నారు.
మహిళా సాహిత్య సదస్సు
యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల్లో సోమవారం ప్రత్యేకంగా మహిళా సాహిత్య సదస్సు జరిగింది. ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు కుమార్‌రాజా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. మార్కెట్ ప్రభావం నుంచి నేటి తరం బాలలను రక్షించుకోవాలన్నా రు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అమ్మ, ఏ డుతరాలు,స్పార్టకస్ వంటి నవలలను ఉపాధ్యాయునులు చదవాలన్నారు. తద్వారా ఉపాధ్యాయులతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రముఖ రచయి త అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ చేతులు జోడించడం ద్వారా కాకుండా చేతులు బిగించడం ద్వారా అభివృద్ధి చెందు తామన్నారు. సాహిత్యం మనుషులను సంస్కరిస్తుం దన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ సాహిత్యం మరో నవ సమాజాన్ని నిర్మిస్తుందన్నారు. అనంతరం అట్టాడ అప్పల నాయుడు రచించిన నక్షత్రబాట, కే.మోహన రచించిన చెమట చెక్కిన వాక్యం పుస్తకాలను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐ.ప్రసాద్‌రావు, చిలుకూరు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వర రావులు వందన సమర్పన చేశారు.
ఎరుపెక్కిన కాకినాడ!
వేలాది మంది యూటీఎఫ్ ఉపాధ్యాయుల ర్యాలీ
యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం కాకినాడలో యూటీఎఫ్ ఉపాధ్యాయులు వేలాది మంది ర్యాలీ చేశారు. యూటీఎఫ్ జెండాలను పట్టుకుని ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామని నినాదాలు చేశా రు. ర్యాలీ కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాల నుంచి మెయిన్ రోడ్డు మీదుగా జగన్నాథపురం బ్రిడ్జి మీదుగా బాలాజీ చెరువు సెంటర్ వరకు సాగింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శలు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ల సారథ్యంలో ఈ ర్యాలీ విజయవంతంగా సాగింది. దీంతో కాకినాడ ఎరు పెక్కింది. దేశం నలు మూలల నుంచి వచ్చిన విద్యా వేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులతో కిటకిటలాడింది. ప్రభుత్వం ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఏలు, మెడికల్ లీవులు చెల్లించాలని నినాదాలు చేశారు. సరెండర్ లీవులు, పీఆర్సీ చెల్లించాలని డిమాండ్ చేశారు. 117 జీవోను రద్దు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కాపా డుకుందామని నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. భారీజెండాలు, డప్పులు వాయి ద్యాలతో కాకినాడ నగరం మారుమోగింది. అలాగే ఉద్యమ గీతాలు ఆలపించారు.
Updated Date - Jan 07 , 2025 | 12:48 AM