ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తునిలో.. తాడోపేడో

ABN, Publish Date - Feb 16 , 2025 | 01:27 AM

తుని మున్సిపాల్టీలో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నేపఽథ్యంలో తునిలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

తుని మునిసిపల్‌ కార్యాలయం

మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక నేపఽథ్యంలో సరికొత్త వ్యూహాలు

సైకిల్‌ ఎక్కుతున్న వైసీపీ కౌన్సిలర్లు.. ఇప్పటికి పది మంది..

తుని రూరల్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): తుని మున్సిపాల్టీలో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నేపఽథ్యంలో తునిలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పట్టు కాపాడుకోవడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యపోరు హోరాహోరీగా మారింది. ఎలాగైనా వైస్‌చైర్మన్‌ పదవి తమ ఖాతాలో వేసుకుని పైచేయి సాధించాలని తలిచిన వైసీపీ క్యాంప్‌ రాజకీయాలకు తెరతీసింది. అప్పటికే గుర్రుగా ఉన్న వైసీపీ కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకునేందుకు వీరందరినీ ముందస్తుగా వాహనంలో ఏజెన్సీ ప్రాంతాలకు తరలించింది. ఈనెల 3వ తేదీన జరిగిన వైస్‌చైర్మన్‌ ఎన్నికకకు కౌన్సిలర్లతో సహా మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ ప్రత్యక్షమవడంతో కూటమి నేతలతో పాటుగా పలువురు ప్రజాసంఘాల నేతలు, దళిత సం ఘాల నాయకులు వీరిని అడ్డుకున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలకు కౌన్సిలర్లను మూకుమ్మడిగా తీసుకురావడం ఏమిటమని అడ్డుపడడంతో ఆ ఎన్నిక వాయిదా పడిం ది. తాజాగా ఎన్నికల కమిషన్‌ ఈ నెల 17న తునిలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైసీపీ కౌన్సిలర్లు వరుసగా సైకిల్‌ ఎక్కడంతో వైసీపీ ఉలికిపాటుకు గురవుతోంది. ఎలాగైనా తుని పురపాలక సంఘంలో వైస్‌చైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు వైసీపీ ఆరాటపడుతున్నప్ప టికీ, ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తితో రగులుతున్న వైసీపీ కౌన్సిలర్లంతా టీడీపీలోకి చేరుతుండడంతో ఆందోళన చెందుతోంది. మరింత మంది కౌన్సిలర్ల చేరిక ఖాయ మంటూ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తుండడంతో వైసీపీలో గుబులు పట్టుకుంది. 17న తుని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో జరిగే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సజావుగా జరిపించాలని వైసీపీకి చెందిన కొందరు హై కోర్టును ఆశ్రయించగా, ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటుగా ప్రభుత్వ యంత్రాంగానికి త్వరలో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. తునిలో హాట్‌ టాపిక్‌గా మారిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో ఏ పార్టీపై చేయి సాధిస్తుందో వేచిచూడాలి.

టీడీపీలోకి మరో ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు

తుని మున్సిపాలిటీలో గతంలో ఒక వైసీపీ కౌన్సిలర్‌ టీడీపీలో చేరగా, ఇటీవల మరో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. శనివారం మరో ఆరుగురు వైసీ పీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి తేటగుంట టీడీపీ క్యాంప్‌ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృషుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిలో వారిలో 12వ వార్డు కౌన్సిలర్‌ బి. వెంకటదారేష్‌, 19 వ వార్డు కౌన్సిలర్‌ ఆచంట సురేఏష్‌, 24వ వార్డు కౌన్సిలర్‌ పులి సత్యనారాయణ, 29వ వార్డు కౌన్సిలర్‌ దాశపర్తి రాజేశ్వరి, 30వ వార్డు కౌన్సిలర్‌ సిద్దిరెడ్డి గౌరీవనజ, 20వ వార్డు రాసబోయిన అప్పయ్యమ్మ టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కూట మి నేత రాజా అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ కౌన్సిలర్లు స్వచ్ఛందంగానే టీడీపీలోకి : అశోక్‌బాబు

తుని రూరల్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తునిలో వైసీపీ కౌన్సిలర్లు స్వచ్చందంగానే టీడీపీలోకి చేరారని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు స్పష్టంచేశారు. అరాచక పాలనతో తునికి దౌర్జన్యాల మరక అట్టించిన మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ప్రజాతీర్పు ఎందుకిలా వచ్చిందో విశ్లేషించుకుంటే బాగుంటుందన్నారు. తన నివాసంలో కూటమిన నేతలు యనమల రాజేష్‌, సుర్ల లోవరాజు, చింతం నీడి అబ్బాయి,యనమల లక్ష్మణరావు, అరిగెల నర్సింహమూర్తి, బోనం చినబాబు, తదితరులతో కలిసి మీ డియా సమావేశంలో మాట్లాడిన అశోక్‌బాబు దాడిశెట్టి రాజాపై ధ్వజమెత్తారు. వైకాపా కౌన్సిలర్లను ఎవరూ ప్రలోభ పెట్టలేదన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి అడుగంటిపోయిందని, వా ర్డుల అభివృద్ధి కోసం యనమల నాయకత్వం లో పనిచేసేందుకు ముందుకు వచ్చారన్నారు.

వైసీపీ కౌన్సిలర్లపై బెదిరింపులకు దిగడం దారుణం : మాజీ మంత్రి రాజా

తుని రూరల్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యేగా, పెద్దమనిషిగా ఉన్న రాజా అశోక్‌బాబు ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగు తున్న వైసీపీ కౌన్సిలర్లపై బెదిరింపులకు దిగడం దారుణమని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తునిలో టీడీపీకి ఎలాగూ విలువలు లేవని, అందుకే అశోక్‌బాబును రంగంలోకి దింపారని విమర్శించారు. దాడిశెట్టి రాజా నివాసంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైస్‌చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో పోలీసులను ఉపయోగిం చుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో ఇటీవల జరిగిన దౌర్జన్యంతో వైసీపీ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్లారని, దీంతో కోర్టు ప్రశాంత వాతావరణంలో ఎన్నిక నిర్వహించే బాధ్యత అధికారులపై ఉందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. న్యాయం తమ పక్షాన ఉందని, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో గెలిచి తీరుతామని చెప్పారు.

Updated Date - Feb 16 , 2025 | 01:27 AM