కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:57 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది
ఆత్రేయపురం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.2,36,809 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. స్వామివారి అన్నదాన భవన నిర్మాణానికి మండపేటకు చెందిన మేకా సత్యసాయి కాశీవినయ్ కుటుంబ సభ్యులు రూ.1.16 లక్షల విరాళం ఇచ్చారు. దాతలకు ఆలయ సబ్బంది స్వామివారి చిత్రపటం అందించారు.
Updated Date - Feb 04 , 2025 | 12:57 AM