సర్వేలను పూర్తిచేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజ
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:14 AM
ఎంఎస్‌ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్ ఇన్ హౌస్ హోల్డ్స్, జియో ట్యాగింగ్, నాన్ రెసిడెన్సీ ఇన్ ఏపీ, చిల్డ్రన్స్ వితవుట్ ఆధార్, డెత్ ఆడిట్ ఇలా పలు సర్వేలను పూర్తిచేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజలో ఉండగా కాకినాడ జిల్లాలోని పె ద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు తదితర మున్సిపాల్టీలు వెనుకబడ్డాయి.
కార్పొరేషన్(కాకినాడ), ఫిబ్రవరి 17(ఆంధ్ర జ్యోతి): ఎంఎస్‌ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్ ఇన్ హౌస్ హోల్డ్స్, జియో ట్యాగింగ్, నాన్ రెసిడెన్సీ ఇన్ ఏపీ, చిల్డ్రన్స్ వితవుట్ ఆధార్, డెత్ ఆడిట్ ఇలా పలు సర్వేలను పూర్తిచేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజలో ఉండగా కాకినాడ జిల్లాలోని పె ద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు తదితర మున్సిపాల్టీలు వెనుకబడ్డాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి ఆదేశాల మేరకు కాకినాడ కమిషనర్ భావన సూచనలతో ఆయా మున్సిపాల్టీల పరిధిలోని కమిషనర్లు, నోడల్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణను కాకినాడ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్యాలయంలో అదనపు కమినర్ కెటి సుధాకర్, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాల్టీల్లోని సచివాలయాల పరిధిలో పూర్తిచేయాల్సిన ఆరు సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషన ర్ కేటీ సుధాకర్ ఆదేశించారు. సర్వేలను పూర్తిచేయకపోవడానికి గల కారణాలను అడిగితెలుసుకుని, సర్వేను సకాలంలో పూర్తిచే యాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో టీపీఆర్వో శైలజ, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Feb 18 , 2025 | 01:14 AM