ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యమ బాట పట్టిన సహకార ఉద్యోగులు

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:30 AM

సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 36ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సహకార ఉద్యోగులు బుధవారం నుంచి ఆందోళన బాట పట్టారు.

అమలాపురం టౌన్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 36ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సహకార ఉద్యోగులు బుధవారం నుంచి ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 10వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు తెలిపారు. సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. 9న పార్లర్‌ రన్‌తో పాటు అన్ని కంప్యూటర్‌ వర్కులు నిలుపుదల చేస్తామన్నారు. 10న డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట, 20న కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 27న రాష్ట్ర సహకారబ్యాంకు విజయవాడ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తామని, అప్పటికే సమస్యలు పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈమేరకు వినతిపత్రాన్ని జిల్లా సహకార అధికారి ఎస్‌.మురళీకృష్ణకు అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచే సత్యనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శులు కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్‌, కోశాధికారి బొబ్బా రామసుబ్రహ్మణ్యచౌదరి పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 01:30 AM