ఆత్మస్థైర్యంతో సవాళ్లను ఎదుర్కోవాలి
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:15 AM
మహిళలు ఆత్మస్థైర్యంతో సవాళ్లను ఎదుర్కోవాలని, అన్నిరంగాల్లో ముందడుగు వేయాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ బుర్రా దివ్యసునీతారాజ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలచర్లలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం చైర్మన్ బోనం కృష్ణసతీష్ అధ్యక్షతన మహిళా సాధికారికత-ఎదుర్కొనే సవాళ్లు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
ప్రముఖ వైద్యురాలు డాక్టర్ దివ్య
పలుచోట్ల మహిళా దినోత్సవ కార్యక్రమాలు
దివాన్‌చెరువు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆత్మస్థైర్యంతో సవాళ్లను ఎదుర్కోవాలని, అన్నిరంగాల్లో ముందడుగు వేయాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ బుర్రా దివ్యసునీతారాజ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలచర్లలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం చైర్మన్ బోనం కృష్ణసతీష్ అధ్యక్షతన మహిళా సాధికారికత-ఎదుర్కొనే సవాళ్లు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి దివ్య ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ బోనం కనకదుర్గ మాట్లాడుతూ మహిళావిద్య, ఉద్యోగం దేశ ముఖ చిత్రాన్ని మార్చగలదని, అసమానతలను తొలగిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నన్నయ విశ్వవిద్యాలయం సహాయాచార్యులు ఎం.గోపాలకృష్ణ, ప్రిన్సిపాల్ టీవీ జనార్దనరావు, సైకాలజిస్ట్ డాక్టర్ ఆశ్లేష ఎడ్ల, కోఆర్డినేటర్ ఎస్.కోటేశ్వరి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దివాన్‌చెరువులోని వీజే ఫార్మశీ కళాశాలలో లైంగిక, పునరుత్పత్తి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జి.మంగాదేవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మహిళల్లో ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డి.నరేంద్ర మాట్లాడుతూ నేటి సమాజంలో ఎందరో మహిళలు పలు రంగాల్లో రాణిస్తున్నారని, అటువంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ డాక్టర్ ఎన్‌వీవీ జగన్మోహనరెడ్డి, ఛైర్‌పర్సన్ ఎన్.శకుంతల, వైస్‌ఛైర్‌పర్సన్ ఎన్.తులసీ అపూర్వ, అధ్యాపకులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 01:15 AM