ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాద రహదారిలోనే ప్రయాణాలు

ABN, Publish Date - Jan 31 , 2025 | 12:46 AM

పుంత రోడ్లు, కాలువగట్టు రహదారులకు ఇరువైపులా పెరిగిన చెట్లతోపాటు, పిచ్చిమొక్కలతో మూసుకుపోయాయి.

రావులపాలెం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పుంత రోడ్లు, కాలువగట్టు రహదారులకు ఇరువైపులా పెరిగిన చెట్లతోపాటు, పిచ్చిమొక్కలతో మూసుకుపోయాయి. దీంతో ఈ రహదారిలో ప్రయాణించాలంటే వాహనదారులు భయాందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా రైతులు పొలం పనులు ముగించుకుని రాత్రి సమయాల్లో ఈ రహదారిలోనే రాకపోకలు సాగిస్తుంటారు. తుప్పలు, పిచ్చిమొక్కల కారణంగా విషసర్పాలు రోడ్డుపైకి వచ్చేస్తూ వాహనదారులు, రైతులను తీవ్ర భయకంపితులను చేస్తున్నాయి. రావులపాలెం మండలంలోని కాలువగట్టు, పుంత రోడ్లకు ఇరువైపులా పెరిగిన తుప్పలు, ముళ్లచెట్ల కారణంగా ఇరువైపులా మూసుకుపోయాయి. రావులపాలెం అరటి మార్కెట్‌ యార్డు నుంచి వెదిరేశ్వరం మీదుగా కొత్తపేట వెళ్ల్లే కాలువగట్టు రోడ్డు వాహనదారులను భయాం దోళనకు గురి చేస్తున్నాయి. గోపాలపురం జాతీయ రహదారి నుంచి ఈతకోట-గంటి రోడ్డుకు వెళ్లే ముమ్మిడివరప్పాడు పంటకాలువ గట్టు వైపు రాకపోకలు సాగించేం దుకు జంకాల్సిన పరిస్థితి నెలకొంది. రావులపాడు వంతెన వద్ద నుంచి ర్యాలీ వైపు వెళ్లే కాలువగట్టు రోడ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పుంత రోడ్లు ఏటిగట్లు సైతం రహదారికి ఇరువైపులా చెట్లు పెరిగిపోవడంతో రాకపోకలు సాగించేందుకు రైతులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చిమొక్కలు, తుప్పలను తొలగించి వాహనదారులకు, రైతులకు రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:46 AM