ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెత్త రీసైక్లింగ్‌కు భూసేకరణ చేపట్టాలి

ABN, Publish Date - Jan 19 , 2025 | 12:21 AM

అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లోని ఘన, ద్రవ పదార్థాల వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించి రీసైక్లింగ్‌ చేసేందుకు వీలుగా అవసరమైన భూ సేకరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

అమలాపురం టౌన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లోని ఘన, ద్రవ పదార్థాల వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించి రీసైక్లింగ్‌ చేసేందుకు వీలుగా అవసరమైన భూ సేకరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం 29వ వార్డులో ఈదరపల్లి బైపాస్‌ రోడ్డులోని డంపింగ్‌ యార్డును అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్‌ అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వ్యర్థాలను విభజిస్తూ రీసైక్లింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. చెత్తా చెదారాలను తగలబెడితే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని అటువంటి పనులు చేయవద్దని పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. పట్టణానికే పరిమితం కాకుండా పరిసర గ్రామాల నుంచి వచ్చే వ్యర్థాలను కూడా స్థానికంగా డంపింగ్‌ చేసి రీసైక్లింగ్‌ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కేవీఆర్‌ఆర్‌ రాజు, తిక్కిరెడ్డి నేతాజీ, కౌన్సిలర్‌ చిత్రపు రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ అధికారి జయవెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 12:21 AM