ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రశాంతంగా రేషన్‌ డీలర్ల రాత పరీక్ష

ABN, Publish Date - Jan 20 , 2025 | 12:43 AM

రేషన్‌డీలర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహిస్తున్న రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.

రాజానగరం గైట్‌ కళాశాలలో రేషన్‌ డీలర్ల రాత పరీక్షను పరిశీలిస్తున్న జేసీ చిన్నరాముడు, ఆర్‌డీవో కృష్ణనాయక్‌

గైట్‌ కళాశాలలో రాజమండ్రి డివిజన్‌ పరీక్ష

145 షాపులకు నోటిఫికేషన్‌

450 మంది హాజరు

ఏబీఎన్‌ కళాశాలలో కొవ్వూరు డివిజన్‌ పరీక్ష

64 షాపులకు నోటిఫికేషన్‌

124 మంది హాజరు

రాజానగరం/కొవ్వూరు, జనవరి 19 (ఆంధ్ర జ్యోతి) : రేషన్‌డీలర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహిస్తున్న రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. రాజమ హేంద్రవరం డివిజన్‌కు సంబంధించి గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, కొవ్వూరు డివిజన్‌కు సంబంధించి ఏబీఎన్‌ ్క్ష పీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఆదివారం డీలర్ల ఎంపికకు 80 మార్కులకు రాత పరీక్షలు నిర్వహించారు. ఫెయిర్‌ ప్రైస్‌ షాప్‌(ఎఫ్‌.పి షాప్స్‌) పేరిట పరీక్షలు నిర్వహిం చినట్టు ఆర్‌డీవోలు కృష్ణ నాయక్‌, రాణి సుస్మిత తెలిపారు. గైట్‌ పరీక్షా కేంద్రాన్ని రాజమహేంద్ర వరం ఆర్డీవో కృష్ణనాయక్‌, రాజానగరం తహశీ ల్దార్‌ జీఏఎల్‌ఎస్‌ దేవి ఆకస్మికంగా సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. రాజ మహేంద్రవరం డివిజన్‌ పరిధిలోని రాజానగ రం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, రంగం పేట, అనపర్తి, బిక్కవోలు, రాజమహేంద్రవరం రూరల్‌, అర్బన్‌, కడియం, పది మండలాలకు సంబంధించి 145 దుకాణాలకు 487 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వీరిలో 450 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్టు చెప్పారు. కొవ్వూరు ఆర్డీవో సుస్మిత మాట్లాడుతూ కొవ్వూరు డివిజన్‌ పరిధిలో 9 మండలాల్లో ఖాళీగా ఉన్న 73 రేషన్‌డీలర్లకు గాను 64 షాపుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా 185 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వాటిలో విద్యార్హతలు లోపించడం, నోటిఫికేషన్‌ల్లో పొందుపర్చిన రోస్టర్‌లో దరఖాస్తు చేయకపోవడం, వయో పరిమితి 40 ఏళ్లు దాటిన అభ్యర్థులకు సంబంధించి 53 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. ఆదివారం 132 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 8 మంది గైర్హాజరయ్యారన్నారు. ఈ నెల 21వ తేదీన పరీక్షా పత్రాల మూల్యాంకనం చేస్తామన్నారు. 28వ తేదీన 20 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 31వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు.ఆమె వెంట తహశీల్దార్‌ ఎం. దుర్గాప్రసాద్‌, ఏఎస్‌వో ఎం.నాగాంజనేయులు, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. వై.రమేష్‌, సీఎస్‌ డీటీలు ఎం.సునీత, ఎ.సత్యనారాయణ, ఎం. అనిల్‌, టి.దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 12:43 AM