ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీఎం కిసాన్‌ పథకం కింద జిల్లాకు రూ.24.70 కోట్లు

ABN, Publish Date - Feb 20 , 2025 | 12:31 AM

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించే లక్ష్యంతో మూడు విడతులుగా కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా రైతుల ఖాతాకు జమ చేయనుంది. దీనిలో భాగంగా రైతులకు మొదటి విడత నిధులు ఏప్రిల్‌ నుంచి జూలై వరకు అందజేయనున్నారు.

అమలాపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించే లక్ష్యంతో మూడు విడతులుగా కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా రైతుల ఖాతాకు జమ చేయనుంది. దీనిలో భాగంగా రైతులకు మొదటి విడత నిధులు ఏప్రిల్‌ నుంచి జూలై వరకు అందజేయనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని లక్షా 24 వేల మంది రైతులకు రూ.24.70 కోట్లను పీఎం కిసాన్‌ పథకం కింద అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత ఏప్రిల్‌ నుంచి జూలై వరకు రూ.2వేల వంతున రెండో విడత ఆగస్టు నుంచి నవంబరు వరకు రూ.2 వేలు వంతున మూడో విడత డిసెంబరు నుంచి మార్చి వరకు రూ.2 వేలు వంతున డీబీటీ విధానంలో రైతుల ఖాతాకు నేరుగా జమ చేయనున్నారు. ఇప్పటి వరకు 18 విడతల్లో రూ.16,628 కోట్ల లబ్ధిని రైతులకు చేకూర్చారు. ఈ నెల 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయడానికి నిర్ణయించారు. రైతులు పెట్టుబడులు, వ్యవసాయ పరికరాల కొనుగోలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి కొనుగోళ్లకు ఈ నిధులు వినియోగించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - Feb 20 , 2025 | 12:31 AM