జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే దొరబాబు
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:30 AM
పిఠాపురం, మార్చి 7(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యా లయంలో శుక్రవారం సాయంత్రం దొరబాబుకు పార్టీ అధినేత, డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు. ఆయనతో పా టు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు జనసేనలో చేరారు. ఉమ్మడి తూర్పుగో
కండువా కప్పి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
అదే బాటలో జడ్పీ వైస్‌చైర్మన్, పలువురు ప్రజాప్రతినిఽదులు
పిఠాపురం, మార్చి 7(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యా లయంలో శుక్రవారం సాయంత్రం దొరబాబుకు పార్టీ అధినేత, డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు. ఆయనతో పా టు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు జనసేనలో చేరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కొత్తపల్లి పద్మబుజ్జి, ఏఎంసీ మాజీ చైర్మన్ మొగలి బాబ్జీ, ఏలేరు డిసి్ట్రబ్యూటరీ కమిటీ మా జీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం ఏరియా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపల్లి చినబాబీ, డాక్టర్ సెల్స్ విభాగానికి చెందిన డాక్టర్ పంతం రాథేష్, శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానం మాజీ చైర్మన్ రెడ్డెం జనార్థన్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు సహా పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ సొసైటీ అధ్యక్షులు, వైసీపీ కీలక నేతలు జనసేనలో చేరగా వారిని పవన్ ఆహ్వానించారు. మరికొంత మంది వైసీపీ సర్పంచ్‌లు, ముఖ్యనేతలను రాష్ట్ర మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీలోకి ఆహ్వానించి జనసేన కండువాలు కప్పారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్, శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పిఠాపురం జనసేన ఇన్ చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులున్నారు.
Updated Date - Mar 08 , 2025 | 12:30 AM