ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బియ్యం వేలానికి చర్యలు

ABN, Publish Date - Feb 12 , 2025 | 01:21 AM

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసిన బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం చట్ట విరుద్ధమని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. జిల్లాలోని పలు వ్యాపార సంస్థలకు చేరుకున్న పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో భద్రపరిచినట్లు చెప్పారు. మండపేట మండలం వేములపల్లి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద 82.944 మెట్రిక్‌ టన్నులు, అంబాజీపేట మండలం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద 20.506 మెట్రిక్‌ టన్నుల సీజ్‌చేసిన బియ్యం ఉందన్నారు.

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసిన బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం చట్ట విరుద్ధమని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. జిల్లాలోని పలు వ్యాపార సంస్థలకు చేరుకున్న పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో భద్రపరిచినట్లు చెప్పారు. మండపేట మండలం వేములపల్లి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద 82.944 మెట్రిక్‌ టన్నులు, అంబాజీపేట మండలం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద 20.506 మెట్రిక్‌ టన్నుల సీజ్‌చేసిన బియ్యం ఉందన్నారు. సీజ్‌ చేసిన బియ్యాన్ని వేలం వేయడానికి నిర్ణయించామని పాటలో పాల్గొనదలిచినవారు రూ.2 లక్షలు డిపాజిట్‌గా జాయింట్‌ కలెక్టర్‌ పేరిట డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీసి ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30లలోపు కలెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో వేలం నిర్వహిస్తామన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 01:21 AM