మోదీ పాలనలో రాజ్యాంగానికి ముప్పువాటిల్లే పరిస్థితులు
ABN, Publish Date - Jan 08 , 2025 | 01:19 AM
ప్రధాని మోదీ పాలనలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు విమ ర్శించారు.
అంబేడ్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా జరిగిన కార్యక్రమంలో పళ్లంరాజు
కాకినాడ సిటీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పాలనలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు విమ ర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్క ర్‌పై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమి త్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాల యం నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపుగా ఇంద్రపాలెం వంతెన సమీపంలో ని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నిర సన తెలిపారు. అమిత్‌షాను తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు నినాదాలు చేశారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, కాకినాడ సిటీ కాంగ్రెస్ అధ్య క్షుడు చెక్కా నూకరాజు నాయకత్వం వహించా రు. పళ్లంరాజు మాట్లాడుతూ నేటి పాలకులు భారత రాజ్యాంగాన్ని అమలుపరచకుండా దాని లోని అన్ని వ్యవస్థలను క్షీణపరిచారన్నారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌కు స్వేచ్ఛ లేకుండా అధికార పార్టీకి అనుకూలంగా మలచుకుని మహారాష్ట్రలో ఎన్ని కల తేదీలు మార్చేశారని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు మల్లిపూడి రాంబాబు, నక్కా సత్యనారాయణ, ిపీసీసీ ఉపాధ్యక్షుడు మట్టా శివప్రసాద్, పీసీసీ సభ్యుడు పోలిశెట్టి శ్రీనివాసు, నియోజకవర్గ ఇన్ చార్జిలు తుమ్మల దొరబాబు, మరోతి శివగణేష్, గేలం శ్రీనివాసరావు, నీరుకొండ సత్యనారాయణ, పిల్లి చిన్న తదితర నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 01:19 AM