ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి

ABN, Publish Date - Feb 06 , 2025 | 01:21 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని జిల్లా ఇన్‌ చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపు నిచ్చారు.

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి5 (ఆంధ్ర జ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని జిల్లా ఇన్‌ చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపు నిచ్చారు. రాజమహేంద్రవరం 1వ డివిజన్‌ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో మాజీ కార్పొరేటర్‌ కడలి రామకృష్ణ కార్యాల యం వద్ద బుధవారం రాత్రి సిటీ నియోజకవర్గ క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలతో జరిగిన సమావేశానికి మంత్రి రామానాయుడు, ఎమ్మె ల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మా ట్లాడుతూ గతంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమే గెలిచాం కాబట్టి ఈ దఫా ఎన్నికల్లో బాగా కష్టపడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తులను గెలిపించాలన్నారు. 2024లో జరిగిన సా ర్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ర్టైక్‌రేట్‌తో ఎలా గెలిచామో.. అదే స్థాయిలో రాజశేఖర్‌ గెలవా లని అన్నారు. ఉభయగోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం రాజమహేంద్రవరం అర్బ న్‌ అని, ఇక్కడ 17,286 ఓట్లు ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలని, అర్బన్‌లో ఓటర్ల జాబితాలో ఓటర్ల చిరునామాలు వీధుల పేరు తో, గ్రామాల్లో వార్డుల పేరుతోను ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించడం సులభతరం అవు తుందన్నారు. రాజమహేంద్రవరంలో ఉన్న ఓటర్ల జాబితాను డివిజన్ల వారీగా సర్దుబాటు చేసుకుని ఒకజాబితా తయారుచేసుకుని 30 ఓట్లకు ఓ బాధ్యుడిని పెట్టుకోవాలన్నారు. ఇలా 600మంది పైబడి బాధ్యులను పెట్టుకోవాలన్నా రు. అంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ప్రత్యేకమైన శ్రద్ధతో ఎవరి 30 ఓట్లు వాళ్లే చూసుకుంటే సరిపోతుందన్నారు. ఈ ఓట్లలో పాజిటివ్‌, నెగిటివ్‌ ఓట్లు గుర్తించుకోవాలని, పాజిటివ్‌ ఓట్లు 100 శాతం పోల్‌ అయ్యేవిధంగా కృషి చేయాలన్నారు. నెగిటివ్‌గా ఉన్న ఓటర్లకు అవగాహన కల్పించాలని, అలాగే బ్యాలెట్‌లో ఓటు వేసేటప్పుడు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, వరుస నెంబరులో పేరాబత్తుల రాజశేఖర్‌ పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 నెం బరు వేయాలని చెప్పారు. అది కూడా పోలింగ్‌ బూత్‌లో సిబ్బంది ఇచ్చే పెన్నునే వినియోగించాలని, గడిలో నెంబరు మాత్రమే వేయాలని తెలిపారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమర్థవంతమైన నాయకుడని, ఆయన నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసికట్టుగా పేరాబత్తులను గెలిపించాలన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల గెలుపే లక్ష్యం గా కృషి చేయడం జరుగుతుందన్నారు. గత ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే పేరాబత్తుల గెలుస్తారని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు చైర్మ న్‌ బత్తుల తాతయ్యబాబు, పరిశీలకులు బోళ్ల వెంకటకృష్ణ ప్రసాద్‌ , మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, జనసేన నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, జనసేన నగర అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 01:21 AM