ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నో..ఛాన్స్‌!

ABN, Publish Date - Mar 10 , 2025 | 12:52 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కూట మి నేతలకు నిరాశ ఎదురైంది.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించిన నేతల ఎదు రుచూపులు ఫలించలేదు.

ఉమ్మడి జిల్లా నేతలో ్ల నిరాశ

ఆశావహులకు బుజ్జగింపులు

వచ్చేసారి చూద్దామని హామీ

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కూట మి నేతలకు నిరాశ ఎదురైంది.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించిన నేతల ఎదు రుచూపులు ఫలించలేదు.. పదవి తప్ప కుండా వస్తుందని ఆశించిన నాయకులకు నిరాశే మిగి లింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఆశించారు. ఉమ్మ డి జిల్లాలో ఒక రెండు ఎమ్మెల్సీలు లభిస్తా యని అంతా ఊహించినా లెక్కతప్పింది. అధి ష్ఠానం ఒక్కటీ కేటాయించలేదు.

పలువురికి నిరాశే..

సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో సీట్ల సర్దుబాట్ల మధ్య కొందరికి టికెట్లు దక్కలేదు. అప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలకు ఎమ్మెల్సీ కోటాలో చూద్దామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో చాలా మంది ఎదురు చూశారు. కానీ రాష్ట్రం లో కేవలం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఖాళీ అవ్వడం వల్ల తెలుగుదేశం 3, జనసేన 1, బీజేపీ 1 కేటాయించారు. దీని వల్ల ఆశా వహులకు అవకాశం రాలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ,నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పదవి ఇస్తామని అధిష్ఠానం హా మీ ఇచ్చింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌కు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇక కోనసీమ నుంచి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా పదవి ఆశించారు.రాష్ట్రంలో ఎక్కువగా ఆశించే వారి సంఖ్య బాగా పెరడంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. సర్దుబాట్ల వల్ల పలువురు ఎమ్మెల్సీ ఆశలు నీరుగారిపోయా యి.ఈ మేరకు సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడి తర్వాత ఎప్పుడు ఎమ్మెల్సీ ఖాళీ అయినా హామీ ఇచ్చిన వారికి ఇస్తామని చెప్పాలని ఆదేశించారు.ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇద్దరు నేతలకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. 2027లో ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని..అప్పుడు మీకు కచ్చితంగా స్థానం కల్పిస్తామని స్వయంగా సీఎం చంద్ర బాబు చెప్పమన్నారని చెప్పడం గమనార్హం.

యనమలకు కీలక పదవి?

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పదవి కాలం ఈనెల 29తో ముగియనుంది. ఈసారి ఆయన ఎమ్మెల్సీని ఆశించినా దక్కలేదని సమాచారం. సీఎం చంద్రబాబుకు సన్నిహి తుడు, టీడీపీలో కీలకనేతగా ఉన్న యనమ లకు త్వరలోనే మరో కీలక పదవి రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యత్వం వస్తుందని లేదా గవర్నర్‌ పదవి లభిస్తుందనే ప్రచారం ఉంది.తుని నియోజకవర్గం పరిధి లోని తేటగుంటలో హైవే సమీపంలో తోట లోని ఆయన ఇంటివద్ద ఇటీవల పెద్ద గేటు నిర్మిస్తుండడంతో పాటు, గేటు సమీపంలో బంకర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతు న్నారు. ఈ నేపథ్యంలో ఏదో కీలక పదవి రాబోతుందనే ప్రచారం ఊపందుకుంది.

Updated Date - Mar 10 , 2025 | 12:52 AM