ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఊహల పల్లకీలో... ఊరేగించనా?

ABN, Publish Date - Feb 25 , 2025 | 01:28 AM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల్లో ముగియనుండడంతో ఈ స్థా నాలకు కొత్తగా ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా సోమవారం షెడ్యూల్‌ జారీ అయింది. ఎమ్మెల్సీ పదవి కోసం అప్పుడే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆశావహుల సందడి పెరి గింది. పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు నేతలు తెర వెనుక ప్రయత్నాలు ఆరంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామ కృష్ణుడి పదవీ కాలం ముగుస్తుండడంతో ఆయ నకు పొడిగింపు ఛాన్స్‌ లేనట్లేనని పార్టీ ఇది

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎవరికో..

ఎన్నిక షెడ్యూల్‌ జారీ

మార్చి 20న పోలింగ్‌.. ఫలితాలు

ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ

29 వరకూ ఎమ్మెల్సీగా యనమల

మళ్లీ పొడిగింపు లేనట్లే?

జిల్లా నుంచి ఎవరికి దక్కేనో

ముందువరుసలో వర్మ

పవన్‌ కోసం సీటు త్యాగం

తొలి ఎమ్మెల్సీకి బాబు హామీ

జనసేన నుంచి నాగబాబు

ఆశావహుల ప్రయత్నాలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల్లో ముగియనుండడంతో ఈ స్థా నాలకు కొత్తగా ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా సోమవారం షెడ్యూల్‌ జారీ అయింది. ఎమ్మెల్సీ పదవి కోసం అప్పుడే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆశావహుల సందడి పెరి గింది. పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు నేతలు తెర వెనుక ప్రయత్నాలు ఆరంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామ కృష్ణుడి పదవీ కాలం ముగుస్తుండడంతో ఆయ నకు పొడిగింపు ఛాన్స్‌ లేనట్లేనని పార్టీ ఇది వరకే సంకేతాలు పంపింది. దీంతో ఉమ్మడి జిల్లా కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఎవరిని వరిస్తుంద నేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జనసేన నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పద వి కట్టబెడతారని ప్రచారం జరుగుతున్న నేప థ్యంలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఎవరిని వరిస్తాయో చూడాల్సిందే మరి.

యనమలకు ఛాన్స్‌ లేనట్లే..

తుని నుంచి మాజీ మంత్రి యనమల ప్రస్తు తం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో ఈయనకు మం త్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ఈసారి ప్రభుత్వంలో యువ నేతలకు ఛాన్స్‌ ఇవ్వాలన్న టీడీపీ సిద్ధాంతం నేపథ్యంలో సీని యర్‌ అయిన యనమలకు అమాత్య పదవి దూ రమైంది. అయితే ఎమ్మెల్సీ పదవి ఎలాగూ ఉం డడంతో పెద్దగా యనమలకు ఇబ్బంది రాలేదు. పైగా ఎన్నికల్లో యనమల కుటుంబానికి ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ సీట్లు పార్టీ కట్టబెట్టింది. దీంతో ఇప్పుడు యనమల తనయురాలు దివ్య తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉన్నారు. వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా యనమ లతో కలిపి ఆయన కుటుంబానికి చెందిన మొ త్తం నలుగురు వివిధ పదవుల్లో కొనసాగుతు న్నారు. ప్రస్తుతం యనమలకు ఉన్న ఎమ్మెల్సీ పదవి మార్చి 29వ తేదీతో ముగుస్తోంది. కానీ ఆయనకు తిరిగి ఈ పదవిని మళ్లీ కొనసాగించే అవకాశం లేదని పార్టీ ఇప్పటికే సంకేతాలు పం పింది. ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యేల బలం ప్రకారం కూటమికే దక్కను న్నాయి. వీటిలో టీడీపీ నాలుగు తీసుకుని, జనసేనకు ఒకటి కేటాయించే అవకాశం ఉంది.

ముందు వరుసలో వర్మ..

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ పదవుల్లో తొలి ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ అధిష్ఠానం గతంలో ప్రకటించింది. యనమల స్థానంలో ఖా ళీ అయిన ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు ఎవరి ద్వారా భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రేసులో పిఠాపురం వర్మ ముందువరుసలో ఉన్న ట్టు సమాచారం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీటును వర్మ త్యాగం చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో వర్మకు సీటు లేకుండా పోయింది. ఈనేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికి వర్మను పిలిపించి అధికారంలోకి రాగానే తొలి ఎమ్మెల్సీ పోస్టు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ పదవితో పాటు క్షత్రియుల కోటాలో మరింత గౌరవం కల్పిస్తానని పేర్కొన్నారు. అటు ఎన్నికల ప్రచా రంలో పవన్‌ సైతం వర్మ లాంటి నేత చట్ట సభల్లో ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది. వర్మ సైతం తనకు ఈ దఫా పదవి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

మా సంగతేంటి?

గడచిన ఐదేళ్లలో పార్టీ కోసం ఆర్థికంగా, కేడర్‌ పరంగా వెన్నుదన్నుగా ఉన్నామని, ఎమ్మెల్సీ పదవితో తమను గౌరవించాలని కాకినాడ, కోన సీమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కొందరు టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఐదేళ్లలో పార్టీకి ఆర్థికంగాను, కేడర్‌పరంగాను చేసిన సేవలను వివరిస్తూ త్రుటిలో సీటు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేస్తూ పదవికి పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా పార్టీ ఆశా వ హుల నియోజకవర్గాల్లో రహస్యంగా ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేసినట్టు సమాచారం. ఆ సర్వే ప్రకారం పార్టీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి ఉంటుం దని అంటున్నారు. కోనసీమ జిల్లా నుంచి ఓ మహిళా నేత తనకున్న పలుకుబడితో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటు కమ్మ సామాజికవర్గం నుంచి సైతం కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఎవరిని వరిస్తుందనేది త్వరలో తేలనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 10న నామినేషన్‌ దాఖలు చేయడానికి ఆఖరిరోజు కావడంతో వచ్చే నెల మొదటివారం లోనే పదవుల కేటాయింపుపై స్పష్టత రానుంది.

నాడు పలువురి త్యాగం?

ఎన్నికల సమయంలో పిఠాపురం సీటును పవన్‌కల్యాణ్‌ కోసం మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం చేశారు. బత్తుల బలరామకృష్ణ కోసం రాజానగరం సీటును బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న వాసంశెట్టి సుభాష్‌ కోసం రామచంద్రపురం సీటును రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న కందుల దుర్గేష్‌ కోసం నిడద వోలు సీటు బూరుగుపల్లి శేషారావు త్యాగం చేశారు. వీరిలో రాజానగరం సీటు త్యాగం చేసిన బొడ్డు వెంకటరమణ చౌదరిని రుడా చైర్మన్‌గా నియమించింది. అంతేకాకుండా రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు కేబినెట్‌ ర్యాంకు కట్టబెట్టింది. రెడ్డి సుబ్రహ్మణ్యంకు పార్టీ పొలిట్‌ బ్యూరో హోదా ఇచ్చింది. ఇక వీరిలో మిగిలింది వర్మ, శేషారావు మాత్రమే. నాడు టిక్కెట్లు కోసం గట్టిగా ప్రయ త్నించిన మరికొందరికి వివిధ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టింది.

నాగబాబుకు ఇస్తే..

జనసేన నుంచి నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరిగింది. దీనికి సంబంధించి కొంతకాలం కిందట కూటమి తర పున అధికారిక ప్రకటన వచ్చింది. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తే వర్మకు ఛాన్స్‌ ఉండదనే ప్రచారం కొంతకాలం కిందట జరిగింది. ఖాళీ అయిన ఐదు స్థానాల్లో ఒకటి జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఆ కోటాలో నాగబాబు ను భర్తీ చేస్తారనే చర్చ జరుగుతోంది. టీడీపీ ఖాతాలో ఉండే నాలుగింటిలో ఒకటి ఉమ్మడి జిల్లా కోటాలో వర్మకు ఇస్తారని, తద్వారా ఏ సమస్యా ఉండదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Feb 25 , 2025 | 01:29 AM