ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులకు అన్యాయం జరగకుండా రీసర్వే ప్రక్రియ

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:05 AM

భూయజమానులకు, రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఎవరి భూములు వారికే దక్కే విధంగా రీసర్వే అప్‌డేట్‌, డేటా ఎంట్రీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అమలాపురం ఆర్డీవో కె.మాధవి సూచించారు.

అమలాపురం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): భూయజమానులకు, రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఎవరి భూములు వారికే దక్కే విధంగా రీసర్వే అప్‌డేట్‌, డేటా ఎంట్రీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అమలాపురం ఆర్డీవో కె.మాధవి సూచించారు. ఆర్డీవో కార్యాలయంలో శనివారం డివిజన్‌ పరిధిలోని మండల సర్వేయర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారుల శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భూసమస్యలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సానుకూలంగా పరిష్కరించాలన్నారు. డేటా ఎంట్రీ, రీసర్వే శిక్షణను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని సకాలంలో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వేలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్డీవో సూచించారు.

Updated Date - Jan 19 , 2025 | 01:05 AM