కొవ్వూరు వాసులకు గోదావరి జలాలు
ABN, Publish Date - Jan 25 , 2025 | 12:54 AM
గోదావరి ఉపరితల జలాలను శుద్ధిచేసి నియోజకవర్గ ప్రజలకు అందించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్టు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్యవతి నగర్‌లో మున్సిపల్ తాగునీటి పైపులైన్ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ బావన రత్నకుమారి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రా రంభించారు.
కొవ్వూరు టౌన్‌కు రూ.60 కోట్లు, రూరల్‌కు రూ.110 కోట్లతో అంచనాలు
ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
కొవ్వూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గోదావరి ఉపరితల జలాలను శుద్ధిచేసి నియోజకవర్గ ప్రజలకు అందించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్టు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్యవతి నగర్‌లో మున్సిపల్ తాగునీటి పైపులైన్ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ బావన రత్నకుమారి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రా రంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్యవతినగర్, పరిసర ప్రాంతాల్లో ప్రజలు 2014 నుంచి తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు మున్సిపల్ నిధులు రూ. 7.70 లక్షలతో రెండు విడతలుగా పైపులైను పనులను చేపడుతున్నామన్నారు. పనులను వారం రోజుల్లో పూ ర్తిచేసి తాగునీటిని అందిస్తా మన్నారు. గోదావరి జలాలు శుద్ధిచేసి అందించేందుకు కొ వ్వూరు టౌన్‌కు రూ.60 కోట్లు, రూరల్‌కు రూ.110 కోట్లతో అంచనాలు తయారుచేసి ప్ర భుత్వానికి అందించామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, డేగల రాము, మున్సిపల్ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సత్కారం
ఎమ్మెల్యే వెంకటేశ్వరరావును బీజేపీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయిన పిక్కి నాగేంద్రకు అభి నందనలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృదిఽ్ధ కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో పరిమి రాధ, కోడూరి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ, గన్నమని భాస్కరరావు, జగన్, పవన్, తేజ, కమల్ పాల్గొన్నారు.
Updated Date - Jan 25 , 2025 | 12:54 AM