ఎనిమిదేళ్లుగా ఇంతే!
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:20 AM
ఆ భవనం నిర్మించి 8 ఏళ్లవుతోంది.. నేటికీ ప్రారం భానికి నోచుకోలేదు.. దీంతో శిథిలావస్థకు చేరు తోంది.. దేవుడి భవనం ఎవరికి పట్టింది.. ఏ ఒక్కరూ అటు వైపు చూసిన దాఖలాలే ఉండ డంలేదు..
కోరుకొండలో నిరుపయోగం
రేపటి నుంచి నరసన్న ఉత్సవాలు
పెందుర్తి దృష్టి పెట్టాలని డిమాండ్
కోరుకొండ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆ భవనం నిర్మించి 8 ఏళ్లవుతోంది.. నేటికీ ప్రారం భానికి నోచుకోలేదు.. దీంతో శిథిలావస్థకు చేరు తోంది.. దేవుడి భవనం ఎవరికి పట్టింది.. ఏ ఒక్కరూ అటు వైపు చూసిన దాఖలాలే ఉండ డంలేదు.. దేవుడి చెంతనే నిర్మించినా సేవకు మాత్రం దూరంగానే ఉండడం గమనార్హం. చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి కొండ దిగువున స్వామి వారి పాదాల సమీపంలో 2018లో రూ.35 లక్షలు వెచ్చించి నిర్మించిన భక్తుల డార్మెటరీ హాల్ ఈ నాటికి ప్రారంభానికి నోచుకోలేదు. డార్మెటరీ హాల్ నిర్మించిన తరువాత సుమారు 6 బ్రహ్మోత్సవాలు జరిగాయి.. అయితే డార్మెటరీ హాల్ మాత్రం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అప్పటి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ హ యాంలో అన్నవరం దేవస్థానం నిధులతో డార్మెటరీ హాల్ నిర్మించారు. అయితే ఈ డార్మె టరీ ప్రారంభోత్సవంపై గత ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కానీ ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కానీ చేసిన ప్రయత్నాలు ఫలించిన దాఖలాలు లేవు. కేంద్ర పురావస్తు పరిశోధన సంస్ధ ఆధీనంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంపైన కొండపైన, కొండ దిగువున కొండ చుట్టూ ఎలాంటి నిర్మాణాలు చేయాలన్నా అనుమతులు తీసుకోవాలి. కేంద్ర పురావస్తు సంస్థ అనుమతులు తీసుకోకుండా నిర్మించడం వల్లనే ఎనిమిదేళ్లయినా డార్మెటరీ హాల్ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.. ఇప్పటికే భవనానికి అమ ర్చిన డోర్‌లు,కిటికీలు దెబ్బతింటున్నాయి.మరో వైపు రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతోంది.కోరుకొండ లక్ష్మీ నరసిం హస్వామి కల్యా ణోత్సవాలు ఆదివారం నుంచి నిర్వ హించేందుకు ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికైనా కేబినెట్ హోదా కలిగిన పెందుర్తి వెంకటేష్ దృష్టి సారించి భవనం విని యోగం లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని భక్తజనం కోరుతున్నారు.
Updated Date - Mar 08 , 2025 | 01:20 AM