నేటి నుంచి కోరుకొండలో నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Mar 09 , 2025 | 12:50 AM
కోరుకొండ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆది వారం సాయంత్రం నుంచి ప్రారంభం కా నున్నాయి. పాల్గుణశుద్ధ దశమి ఆదివారం సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణతో కార్యక్రమాలు వైకానస ఆగమనం ప్రకారం ప్రారంభమవుతాయి. ఈనెల 10 వ తేదీ సోమవారం ఒంటి గంటకు రథోత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం. 11వ తేదీ మంగళవారం రాత్రి గరుడ వాహనంసేవ, 12వ తేదీ బుధవారం రాత్రి
కోరుకొండ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆది వారం సాయంత్రం నుంచి ప్రారంభం కా నున్నాయి. పాల్గుణశుద్ధ దశమి ఆదివారం సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణతో కార్యక్రమాలు వైకానస ఆగమనం ప్రకారం ప్రారంభమవుతాయి. ఈనెల 10 వ తేదీ సోమవారం ఒంటి గంటకు రథోత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం. 11వ తేదీ మంగళవారం రాత్రి గరుడ వాహనంసేవ, 12వ తేదీ బుధవారం రాత్రి 7గంటలకు స్వామివారి సదస్యం, రాత్రి 9 గంటలకు హనుమద్‌వాహనంపై గ్రామోత్సవం, 13తేదీ గురువారం రాత్రి 8 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం, శ్రీరంగరాజ స్వామి ఆలయంలో రాత్రి 8 గంటలకు రంగనాధ స్వామి కల్యాణం, 14వ తేదీ శుక్రవారం దేవుని కోనేరు వద్ద చక్రతీర్ధం, సాయంత్రం ధ్వజ అవరోహణ, అద్దాల సేవ, ఊంజల సే వ, రాత్రి 9గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవం, 15వ తేదీ శనివారం రాత్రి స్వామి వారికి శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా ఇతర రా ష్ట్రాల నుంచి తీర్థానికి భక్తులు తరలి వస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నవరం దేవస్థానం దత్తత ఆలయంగా ఉన్న నరసింహ స్వా మి మహోత్సవాలను కనుల పండువగా నిర్వహించాలని అన్న వరం ఆలయ వ్యవ స్థాపక కుటుంబీకుడు ఐవీ రోహిత్ అధికారులకు సూచించారు. రం గరాజభట్టర్ స్వీయ పర్యవేక్షణలో వైఖానస ఆగమబ్రహ్మ పాణింగపల్లి పవనకుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో అనువంశిక ఆర్చకస్వాములు ఉత్సవాలు నిర్వహిస్తారు.
Updated Date - Mar 09 , 2025 | 12:50 AM