ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోరుకొండ నరసన్న కల్యాణోత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Mar 10 , 2025 | 12:40 AM

కోరుకొండ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): నవ నర సింహ క్షేత్రాల్లో ఒకటైన స్వయంభూ కోరుకొండ లక్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు ఆదివా రం రాత్రి ఆలయ ముఖ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో శ్రీచక్ర పెరు మా ళ్లను తీసుకుని దేవుడి కోనేటి వద్దకు వెళ్లి పుట్టకు శాస్త్రోక్తంగా పూజలు చేసి పుట్టమన్ను సేకరి ంచారు. అనంతరం ఆలయం వద్ద అంకురా ర్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు పాణింగపల్లి ప

విద్యుత్‌ కాంతుల్లో నరసింహస్వామి కొండ

కోరుకొండ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): నవ నర సింహ క్షేత్రాల్లో ఒకటైన స్వయంభూ కోరుకొండ లక్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు ఆదివా రం రాత్రి ఆలయ ముఖ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో శ్రీచక్ర పెరు మా ళ్లను తీసుకుని దేవుడి కోనేటి వద్దకు వెళ్లి పుట్టకు శాస్త్రోక్తంగా పూజలు చేసి పుట్టమన్ను సేకరి ంచారు. అనంతరం ఆలయం వద్ద అంకురా ర్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు పాణింగపల్లి పవన్కుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో అను వంశిక ధర్మకర్త పరాసర రంగరాజభట్టర్‌ పర్య వేక్షణలో నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల కు అన్నవరం దేవస్థానం అధికారులు పర్యవేక్ష ణలో వివిధ ప్రభుత్వ శాఖాధికారులు సమన్వ యంతో ఏర్పాట్లు చేశారు. సోమవారం రథోత్స వం సందర్భంగా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వై.శ్రీకాంత్‌, సీఐ వై.సత్యకిషోర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆలయం వద్ద పోలీస్‌ అవు ట్‌పోస్టు ఏర్పాటు చేశారు. జాతరలో అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా కోరుకొండ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచామని డీఎస్పీ తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవాల నిర్వహణకు అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్‌ వైవీ రోహిత్‌, కోరుకొండ దేవస్థానం చైర్మన్‌ రంగరాజ భట్టర్‌, ప్రత్యేక సిబ్బంది తరలివచ్చారు. దేవదాయ, ధర్మదాయ శాఖ నుంచి ఉత్సవాలకు 250మంది సిబ్బందిని నియమించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై మరికొంత మంది సిబ్బం ది, అర్చకస్వాములు, వేద పండితులు వచ్చారు.

నేడు రథోత్సవం, కల్యాణం...

స్వామివారి రథోత్సవం సోమవారం మధ్యాహ్నం 1.56గంటలకు నిర్వహించనున్నారు. రథోత్సవానికి ముందు స్వామిని పెండ్లి కుమారు డు, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అ లంకరిం చి ప్రత్యేక పల్లకిలో మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య తోడ్కొని వచ్చి రథంపై ఆశీనుల ను చేస్తారు. రథానికి ప్రత్యేక పూజలు చేసి వేలాదిమంది భక్తుల గోవింద నామస్మరణ మ ధ్య దేవస్థానం నుంచి రథోత్సవం బయలు దేరుతుంది. రాత్రి 9గంటలకు కల్యాణ మహో త్సవం వైభవంగా జరుగుతుంది. ఈ మేరకు స్వామి కల్యాణ మండపాన్ని విశేష పుష్ప అలం కరణలతో సిద్ధం చేశారు. రథోత్సవం అనంతరం ఎదుర్కోలు సన్నాహంతో నూతన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు సమర్పించి మేళతాళాలతో స్వామి, అమ్మవార్లను రథం పై నుంచి ప్రత్యేక పల్లకీలో ఆలయానికి తోడ్కొని వస్తారు. రాత్రి 8గంటల సమయంలో మంగళస్నానం నిర్వహి స్తారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామి కల్యాణం రాత్రి 9 గంటలకు జరుగుతుంది.

Updated Date - Mar 10 , 2025 | 12:40 AM