రేపటి నుంచి కోనసీమ క్రీడోత్సవాలు
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:15 AM
కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రత్యేక చొరవతో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. కోనసీమ క్రీడోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 2600 మంది పాఠశాలల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.
అమలాపురం రూరల్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రత్యేక చొరవతో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. కోనసీమ క్రీడోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 2600 మంది పాఠశాలల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో కలెక్టర్ పర్యవేక్షణలో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామన్నారు. సోమవారం అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో కోనసీమ క్రీడోత్సవాల ఏర్పాట్లను అమలాపురం ఆర్డీవో కె.మాధవి, జిల్లా ప్రాథికార సంస్థ ముఖ్య శిక్షకుడు పీఎస్ సురేష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు పరిశీలించారు. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా సమగ్రాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేసినట్టు డీఈవో వివరించారు. పారిశుధ్య ఏర్పాట్లు, తాగునీటి సదుపాయంపై చర్చించారు. విద్యార్థులకు అవసరమైన క్రీడా పరికరాలు, క్రీడా దుస్తులను కలెక్టర్ మహేష్‌కుమార్ ప్రత్యేకంగా సమకూర్చినట్టు డీఈవో తెలిపారు. బాలయోగి స్టేడియంలో క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా కబడ్డీ, ఖోఖో కోర్టుల మార్కింగ్ పనులను వ్యాయామ ఉపాధ్యాయులు చేపట్టారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ కార్యదర్శి విజయశ్రీనివాస్, కోచ్ ఐ.భీమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు తోట రవి, కామన మధు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 12:15 AM