ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీజీహెచ్‌లో ఆంకాలజీ ఐసీయూ ప్రారంభం

ABN, Publish Date - Jan 05 , 2025 | 12:27 AM

జీజీహెచ్‌ (కాకినాడ), జనవరి 4(ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌ ఆంకాలజీ విభాగంలో రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డా. పేర్రాజు దినవాహి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరా

ఆంకాలజీ ఐసీయూను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ

జీజీహెచ్‌ (కాకినాడ), జనవరి 4(ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌ ఆంకాలజీ విభాగంలో రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డా. పేర్రాజు దినవాహి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) శనివారం ప్రారంభించారు. తొ లుత మెడిసిన్‌ విభాగంలో డయాలసిస్‌ యూ నిట్‌కు సంబంధించిన ఆర్వోప్లాంట్‌ను వారు ప్రారంభించారు. అనంతరం రూ.10.62 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన పాలియేటివ్‌ ఆంకాలజీ యూనీట్‌, రేడియేషన్‌ ఆంకాలజీ యూనిట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు పడకల సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఐసీయూను ఎమ్మెల్యేలు రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. 2001 బ్యాచ్‌కు చెందిన ఆర్‌ఎంసీ పూర్వ విద్యార్థి డా.పేర్రాజు దినవాహి జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు చిన హనుమంతురావ్‌, పద్మావతి దంపతులు, 2001 ఆర్‌ఎంసీ పూర్వ విదార్థులు కలిసి అందజేసిన నిధుల సాయంతో ఈ ఐసీయూను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు మా ట్లాడుతూ గోదావరి జిల్లాల ఆరోగ్య ప్రధాయిని అయిన కాకినాడ జీజీహెచ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసి జీజీహెచ్‌ను కార్పొరేట్‌కు ధీటుగా వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రస్తుత సమాజంలో క్యా న్సర్‌ మహమ్మారి ఎక్కువ మందిని పట్టి పీడిస్తుందని ఈ పరిస్థితుల్లో క్యాన్సర్‌ విభాగాన్ని మరింత అభివృద్ధి పర్చవల్సి ఉందని, ప్రస్తుత ఐసీయూ క్యాన్సర్‌ పేషెంట్లకు ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూ పరిండెంట్‌ డా.ఎస్‌.లావణ్యకుమారి, డిప్యూటీ సూపరిండెంట్‌, ఆంకాలజీ హెచ్‌వోడి డా.శ్రీనివాసన్‌, మెడిసిన్‌ హెచ్‌వోడి డా.యశోదమ్మ, రామ్‌కోసా అధ్యక్షుడు డా.ఆనంద్‌, కార్యదర్శి డా.అరు ణాధిత్య, కోశాధికారి డా.తేజోకృష్ణ, టీడీపీ నా యకులు అమన్‌జైన్‌, మల్లిపూడి వీరు ఉన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:27 AM