ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటర్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

ABN, Publish Date - Jan 28 , 2025 | 12:33 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి కమిటీ సభ్యులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఇంటర్మీడియట్‌ బోర్డు ఎగ్జామినేషన్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. మార్చిలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను లైన్‌ విభాగాల అధిపతులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎటువంటి పేపరు లీకేజీలకు, మాల్‌ ప్రాక్టీసులకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.

అమలాపురం టౌన్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి కమిటీ సభ్యులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఇంటర్మీడియట్‌ బోర్డు ఎగ్జామినేషన్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. మార్చిలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను లైన్‌ విభాగాల అధిపతులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎటువంటి పేపరు లీకేజీలకు, మాల్‌ ప్రాక్టీసులకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. జనరల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు, ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్‌ థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్‌ ప్రాక్టికల్‌ పరీక్షల కోసం జిల్లాలో 60 కేంద్రాలు, ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షల కోసం 41 కేంద్రాలు కేటాయించామన్నారు. పాఠ్యాంశ పరీక్షల కోసం జిల్లాలో 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఒక ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాల, రెండు సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు, 25 ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలో కలిపి 40 కేంద్రాలను కేటాయించామన్నారు. రాత పరీక్షలకు 22,258 మంది ఉండగా ఒకేషనల్‌కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 5,055 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఏ విధంగా చేయాలో ఆదేశించారు. రాత పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఆర్టీసీ పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని జేసీ ఆదేశించారు. రాత పరీక్ష, పేపరు మీడియం, సబ్జెక్టుల వారీగా లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్వో రాజకుమారి, బోర్డు కన్వీనర్‌ వి.సోమశేఖరరావు, కమిటీ సభ్యులైన డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావుదొర, ఆర్టీసీ ప్రతినిధి శ్రీనివాస్‌, ట్రాన్స్‌కో ఈఈ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2025 | 12:33 AM