గ్రీవెన్స్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:28 AM
సమస్యలపై అందించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ అర్జీలతో పాటు స్వర్ణాంధ్ర విజన్, రెవెన్యూ సమస్యలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
అమలాపురం టౌన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సమస్యలపై అందించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ అర్జీలతో పాటు స్వర్ణాంధ్ర విజన్, రెవెన్యూ సమస్యలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలిపేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం జిల్లాస్థాయిలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్వో రాజకుమారి, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్.త్రినాథరావు, కృష్ణమూర్తి వివిధ సమస్యలపై 210 అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి మాట్లాడుతూ విపత్తుల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖలు సమన్వయంతో జియో కోఆర్డినేటర్స్‌తో మ్యాప్‌లను రూపొందించాలని ఆదేశించారు. రోడ్లు, కాల్వలు, డ్రైనేజీలు, విద్యా సంస్థలు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, సైక్లోన్ పునరావాస కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర అంశాలపై మ్యాప్‌లను చిత్రీకరించాలని ఆదేశించారు. ఈ నెల 28న మధ్యాహ్నం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద స్వామివారి తిరు కల్యాణోత్సవాలకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని జేసీ తెలిపారు. జిల్లాస్థాయి అధికారులతో పాటు వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 28 , 2025 | 12:28 AM