జలకళకు నిధులు!
ABN, Publish Date - Feb 14 , 2025 | 01:19 AM
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇరిగే షన్ వ్యవస్థను నిర్వీర్యమైంది.
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇరిగే షన్ వ్యవస్థను నిర్వీర్యమైంది. వేసవిలో కనీ సం కాలువల్లో పూడిక కూడా తీయని పరి స్థితి ఉండేది. డెల్టా ఆధునికీకరణ పనులు అసలు పట్టించుకోలేదు. వరదల సమయం లో ఏటిగట్లకు తాత్కాలిక పనులకోసం కూడా నానా ఇబ్బందులుపెట్టేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ వ్య వస్థకు పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వరదగట్ల అభివృద్ధి, అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల పటిష్టతకు రెండు విడతలుగా రూ.54.57 కోట్లు మంజూరు చేశా రు. అందులో ఇప్పటికే కొన్ని పనులు ప్రారం భంకాగా, కొన్ని టెండర్ల దశలోనూ, కొన్ని సాంకేతిక అనుమతుల దశలోనూ ఉన్నాయి. ఇంకా అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లతోపాటు గ్రోయి న్లు, డెల్టా ఆధునికీకరణ తదితర పనులకు రూ.257 కోట్ల నాబార్డు నిధులతో 322 పను లు ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపించారు. అలాగే కాలువల క్లోజర్ సమయంలో ఆప రేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) పనులు చేయడానికి రూ.70.01 కోట్లతో 953 పనులు ప్రతిపాదించారు. ప్రస్తుత ఇరిగేషన్ పరిస్థితి మీద ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ సూప రింటెండెంట్ ఇంజనీర్ కె.గోపీనాథ్‌తో ‘ఆంధ్ర జ్యోతి’తో పలు విషయాలు ప్రస్తావించారు.
రబీ సాగుకు నీటి లభ్యత ఏంటి..
ఎస్‌ఈ : ఇబ్బంది ఉండదనే భావిస్తున్నాం. మొత్తం రబీ, మంచినీటి అవసరాలు, చేపల చెరువులకోసం 84 టీఎంలు అవసరం. ఇప్ప టికే 41 టీఎంసీలు వినియోగించారు. ఇంకా మార్చి 31వ తేదీ వరకూ 43 టీఎంసీలు అవ సరం. ప్రస్తుతం సీలేరు నుంచి 7,300 క్యూ సెక్కుల నీరొస్తోంది. మొత్తం అక్కడ నుంచి 10 టీఎంసీల నీరు ఇస్తా మనే హామీ ఉంది. పోలవరం స్పిల్‌వే నుంచి 15 టీఎంసీలు వస్తాయి. సెల్ఫీల్డ్ 2.38 టీఎంసీలు ఉన్నాయి.
మిగతా నీటికోసం యాక్షన్ ప్లాన్..
ఎస్‌ఈ : జిల్లా నీటిపారుదల అభివృద్ధి సంస్థ సమీక్ష నాటికి నీరు పుష్కలంగా ఉం దనే అంచనాతో యాక్షన్ ప్లాన్ ఏమీ సిద్ధం చేయలేదు. సీలేరులో వాస్తవానికి 67 టీఎం సీల నీరు ఉంది. అవసరమైతే ప్రభుత్వ సహా యంతో మరికొంత తెచ్చే ప్రయత్నం చేస్తాం. నిజంగా శివారు ప్రాంతాల్లో ఎక్కడైనా ఎద్దడి వస్తే అప్పటికపుడు నిర్ణయాలు తీసుకోవడా నికి కాకినాడ కలెక్టర్ సుముఖత తెలియ జేశారు. మిగతా జిల్లాల కలెక్టర్లకు కూడా పరిస్థితిని వివరించి నీటి ఇంజన్లు ఏర్పాటు, క్రాస్‌బండ్‌ల నిర్మాణం వంటి పనులు చేస్తాం.
క్లోజర్ సమయంలో కాలువల పనులకు యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా?
ఎస్‌ఈ : 953 పనులు చేయడానికి రూ. 70.01కోట్లతో ప్రతిపాదనలు పంపాం. వాటితో ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులు చేస్తాం.
వరదల సమయంలో ఈసారి ముఖ్య పనులు చేసే పరిస్థితి ఏమైనా ఉందా?
ఎస్‌ఈ : డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధుల కింద ఇప్పటికే రెండు దఫాలుగా నిధులు మంజూరుచేశారు. మొదట విడతలో 37.57 కోట్లను 73 పనులు చేయడానికి ఇచ్చారు. వీటితో ఏటిగట్ల పటిష్టత, అవుట్‌ఫాల్ స్లూ యిజ్‌ల అభివృద్ధి చేయనున్నాం. అంతేకాక పంపా నది స్పిల్‌వే గేట్లు రీప్లేస్‌మెంట్ పను లు కూడా ఉన్నాయి. ఈ పనులకు టెక్నికల్ శాంక్షన్ వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం. కాజ, నర్సాపురం ప్రాంతంలోని కాజ, మడు గుల తూము తదితర ప్రాంతాల్లో అవుట్ ఫాల్ స్లూయిజ్‌లను మరమ్మతులు చేస్తాం. ఇవి టెండర్ల దశలో ఉన్నాయి. ఇటీవల డిజా స్టర్ మేనేజెమెంట్ కింద రెండో విడత రూ.17 కోట్లు వచ్చాయి. వాటితో రాజోలు సబ్ డివిజ న్‌లో అంతర్వేది పరిధిలోనూ, లూటుకుర్రు, ఆదుర్రు అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు మరమ్మతు లు చేయవలసి ఉంది. వీటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
డెల్టా ఆధునికీకరణ పనులేమీ లేవా?
ఎస్‌ఈ : నాబార్డు నిధులు రూ.257 కోట్లతో 322 ఆధునికీకరణ పనులు చేయడా నికి ప్రతిపాదించాం. వీటిలో చాలా అభివృద్ధి పనులను ప్రతిపాదించడం జరిగింది.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న లస్కర్లకు జీతాల సమస్య..
ఎస్‌ఈ : నిధులు వచ్చాయి. ఈనెలాఖరుకి 2024-25కి సంబంధించిన మొత్తం బకాయి లు చెల్లిస్తాం. ఇక సమస్య ఉండదు.
Updated Date - Feb 14 , 2025 | 01:19 AM