అలినేషన్ అనుమతుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:54 AM
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 8(ఆం ధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతికి ఆయా శాఖల ఉన్నతాధికారుల ద్వారా భూముల పరాయికరణ (ల్యాండ్ అలినేషన్)కు సంబంధించి అనుమతుల మంజూరుకోసం ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల పరాయీకరణ భూములు పీవీజీటీ గ్రూప్స్, భూపతిపాలెం, పీఎం జన్మన్ గృహాలు వంటి అంశాలపై సం
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 8(ఆం ధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతికి ఆయా శాఖల ఉన్నతాధికారుల ద్వారా భూముల పరాయికరణ (ల్యాండ్ అలినేషన్)కు సంబంధించి అనుమతుల మంజూరుకోసం ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల పరాయీకరణ భూములు పీవీజీటీ గ్రూప్స్, భూపతిపాలెం, పీఎం జన్మన్ గృహాలు వంటి అంశాలపై సంబంధిత శాఖ ల అధికారులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ, ఏపీట్రాన్స్‌కో, ఎయిర్ పోర్టు, టూరిజం, క్రీడలు, జాతీయ రహదారులు, మార్కెటింగ్, పశుసంవర్ధక, విద్య, ఆరోగ్య తదితర శాఖలకు చెందిన 54 భూ సంబంధ అలినేషన్ ప్రక్రియపై శాఖాధికారులు దృష్టికి తీసుకుని వెళ్లడం, తగిన అనుమతులు పొం దాల్సి ఉంటుందన్నారు. ఆయా భూముల పరాయీకరణకి ఆర్డీవోలు జారీచేయాల్సిన అనుమతులు, మార్గదర్శకాలను అనుసరించి మంజూరుచేయాలని స్పష్టంచేశారు. జిల్లాలో ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలకు చెందిన 99 కుటుంబాలకు చెందిన 399 మందికి తగిన గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఇప్పటికే ఈ విషయమై విచారణ చేపట్టామని, నివేదికల ఆధారంగా వారికి ప్రభుత్వపరంగా చేయూత ఇవ్వడంపై దృష్టిపెట్టాలని ఆర్డీవోలు, హౌసిం గ్, రెవెన్యూ, ఐసీడీఎస్, డీఈవో, డీఆర్‌డీఏ, బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్, రాణిసుస్మిత, జిల్లాలో ఇతర శాఖల ఉన్నతాధికారులు డి.భాస్కర్‌రెడ్డి, కేఎన్ జ్యోతి పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 01:54 AM